E-Paper
Advertisement

Horror Thriller OTT : పుట్టకుండానే చచ్చి టార్చర్ పెట్టే పిల్ల పిశాచి… టీనేజ్ అమ్మాయిని తగులుకుని ఇవేం పనులు?

Horror Thriller OTT : పుట్టకుండానే చచ్చి టార్చర్ పెట్టే పిల్ల పిశాచి… టీనేజ్ అమ్మాయిని తగులుకుని ఇవేం పనులు?
Advertisement

Horror Thriller OTT : భయంతో అల్లాడించే హారర్ సినిమాల కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? ఒక్కసారి ఈ మూవీపై లుక్కేయండి. ఓసారి చూస్తే ఎన్నేళ్లయినా మర్చిపోలేరు. అంత భయంకరంగా ఉంటుంది మరి ఈ హారర్ మూవీ. ఇంతకీ చలికాలంలోనూ చెమటలు పట్టించే ఆ భయంకరమైన మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డేవిడ్ ఎస్. గోయర్ (ది డార్క్ నైట్ కో-రైటర్) డైరెక్ట్ చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ The Unborn (2009). జ్యూఇష్ మిథాలజీలోని “డిబ్బుక్” (ఈవిల్ స్పిరిట్) కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా క్రీపీ అట్మాస్ఫియర్‌ తో హారర్ ఫ్యాన్స్‌ ను బెదరగొడుతుంది. ఓడెట్ యుస్ట్‌మాన్, గ్యారీ ఓల్డ్‌మాన్, కామ్ గిగాండెట్, మీగాన్ గుడ్, ఇడ్రిస్ ఎల్బా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి క్రిటిక్స్ మిక్స్‌డ్ రివ్యూస్ ఇచ్చారు. కానీ హారర్ ఫ్యాన్స్‌కి మంచి ఐ ఫీస్ట్ ఈ మూవీ. Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది. రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి చూస్తే థ్రిల్ డబుల్ అవ్వడం ఖాయం మావా.

Advertisement

Read Also :  ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మోస్ట్ అవైటింగ్ సిరీస్ స్ట్రీమింగ్… ఏ ఎపిసోడ్ ఎన్ని గంటలంటే ?

స్టోరీలోకి వెళ్తే…

కథ యంగ్ వుమన్ కేసీ బెల్డన్ (ఓడెట్ యుస్ట్‌మాన్) చుట్టూ సాగుతుంది. ఆమెకు సడన్ గా వింత పీడకలలు, హాలుసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక చిన్న అబ్బాయి బ్రైట్ బ్లూ ఐస్‌ తో ఆమెను వెంటాడుతూ ఉంటాడు. మిర్రర్‌ లో వింత షేప్స్, ఇంసెక్ట్స్ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ అమ్మాయికి. బేబీ సిట్టింగ్ చేస్తున్నప్పుడు కూడా… ఆమె చూసుకోవడానికి వెళ్ళిన కిడ్ వింతగా బిహేవ్ చేస్తాడు. ఇలా తనకే ఎందుకు జరుగుతుందో తెలియక ఆగమాగం అవుతుంది ఆ టీనేజర్. ఇక ఏం చేయాలో తెలియక కేసీ తన ఫ్యామిలీ హిస్టరీ ఏంటో చెక్ చేస్తుంది. ఆమెకు ట్విన్ బ్రదర్ ఉన్నాడని, అతను కడుపులోనే చనిపోయాడని తెలుస్తుంది. ఆ బాయ్‌కు పుట్టకముందే “జంబీ” అని నిక్‌నేమ్ పెట్టారని తెలుసుకుంటుంది.

Advertisement

ఇప్పుడు ఆ స్పిరిట్ లివింగ్ వరల్డ్‌ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటుంది. అందుకోసం కేసీని పట్టి పీడించడానికి ట్రై చేస్తుంది. ఈ సీక్రెట్ నాజీ ఎక్స్‌పెరిమెంట్స్, ఆష్విట్జ్ క్యాంప్‌కి లింక్ అయి ఉంటుంది. కేసీ దీని నుంచి బయట పడడానికి తన బాయ్‌ఫ్రెండ్ మార్క్, బెస్ట్ ఫ్రెండ్ రోమీ హెల్ప్ తీసుకుంటుంది. రబ్బీ సెండాక్ (గ్యారీ ఓల్డ్‌మాన్) ఎక్సార్సిజం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ స్పిరిట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆ దెయ్యాన్ని ఈ పిల్ల ఎలా వదిలించుకుంది? ఆ క్రమంలో జరిగిన దారుణాలు ఏంటి? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×