E-Paper
Advertisement

క్లాప్స్ కొట్టించే డైలాగ్స్ లేవు… స్టార్ పవర్ లేదు… ఎక్స్పెక్ట్ చేయని ఎండింగ్ ఉన్న క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

క్లాప్స్ కొట్టించే డైలాగ్స్ లేవు… స్టార్ పవర్ లేదు… ఎక్స్పెక్ట్ చేయని ఎండింగ్ ఉన్న క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller : డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా ? ఓ బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ను చూడాలి అనుకుంటున్నారా ? ఈ రెండూ కలిసి ఉన్న, భారతీయ సినిమా రంగంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరు ‘అగ్లీ’ (Ugly). జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతున్న డార్క్ మిస్టరీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. మానవ నైజంలోని స్వార్థం, క్రూరత్వాన్ని కళ్లకు కట్టే కథ ఇది. రోనిత్ రాయ్, రాహుల్ భట్, వినీత్ కుమార్ సింగ్, తేజస్విని కొల్హాపురే తదితరులు ఈ సినిమాలో నటించారు. IMDbలో ఏకంగా 8.0 రేటింగ్ ఉంది ఈ సినిమాకు.

కథలోకి వెళ్తే…

సినిమా అంతా ‘కాళీ’ అనే 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. రాహుల్ (రాహుల్ భట్) అవకాశాల కోసం ఎదురుచూసే నటుడు, అలాగే కాళీకి తండ్రి కూడా. శనివారం నాడు అతను బయటకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే తన కూతురు కాళీని ముంబై వీధుల్లో కారులోనే కూర్చోబెట్టి, పని మీద బయటకు వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి కాళీ అక్కడ కనిపించదు. కంగారుపడిన రాహుల్ తన స్నేహితుడు చైతన్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు.

Advertisement

ఇక్కడే కథలోకి కాళీ సవతి తండ్రి, ముంబై పోలీస్ చీఫ్ శోభన్ బోస్ (రోనిత్ రాయ్) కథలోకి ఎంట్రీ ఇస్తారు. కాళీ కిడ్నాప్ అయిన విషయం తెలిశాక, ఆమెను కాపాడటం పక్కన పెట్టి పాత్రలన్నీ తమ వ్యక్తిగత కక్షలు, స్వార్థ ప్రయోజనాల కోసం మైండ్ గేమ్స్ ఆడటం మొదలు పెడతాయి. రాహుల్‌పై ఉన్న పాత పగతో పోలీస్ చీఫ్ శోభన్ బోస్ అతడిని వేధించడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు రాహుల్ మాజీ భార్య (కాళీ తల్లి) షాలిని సైతం తన భర్త శోభన్ నరకం నుండి తప్పించుకోవడానికి ఈ పరిస్థితిని వాడుకోవాలని చూస్తుంది.

వీరందరి మధ్యలోకి ఒక అనామక కిడ్నాప్ కాల్ రావడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఆ డబ్బును కొట్టేయడానికి చైతన్య, రాహుల్ సోదరి వేర్వేరుగా ప్లాన్లు వేస్తారు. దీంతో కేసు పూర్తిగా పక్కదారి పడుతుంది. ఇక్కడే కథలో ఊహించని షాకింగ్ మలుపు ఉంటుంది. పోలీసులతో పాటు కాళీ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లను పట్టుకునే క్రమంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ చివరకు ఒక మురికివాడకు చేరుకుంటారు. కానీ అక్కడ బయటపడే నిజం అందరినీ నిశ్చేష్టులను చేస్తుంది. ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? ఆ పాప దొరికిందా ? ఇంతకీ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also :  ఈ అడవిలో ఫిజిక్స్ బయాలజీ పని చేయవు… ఒక్కసారి వెళ్తే తిరిగి రారు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×