E-Paper
Advertisement

Udaya Bhanu: రాజీవ్‌.. నిన్ను, నన్ను ఇలా చూసి.. ఎలాంటి రాతలు రాస్తారో?

Udaya Bhanu: రాజీవ్‌.. నిన్ను, నన్ను ఇలా చూసి.. ఎలాంటి రాతలు రాస్తారో?
Advertisement

Udaya Bhanu: ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు’ (Daughter of Prasad Rao Kanabadutaledhu) వెబ్ సిరీస్ గత వారం జీ5 (Zee5) ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

Also Read- Biker: ప్రీమియం ఫార్మాట్లలో రానున్న ‘బైకర్’.. విడుదల ఆరోజే!

వారికి మంచి కంటెంట్ దొరికింది

Advertisement

రాజీవ్ కనకాలను పదే పదే పిలవడం, ఆయన రావడం చూసి.. ‘‘అసలే వీళ్లు మంచోళ్లు కాదు. నేను ఇలా పిలవడం, నువ్వు అలా రావడంపై రకరకాలుగా కథనాలు రాసేస్తారు. మాములు ముదుర్లు కాదు వీళ్లు. రేపు మనద్దరిపై ఎలాంటి థంబ్‌నైల్స్ పెడతారో. వారికి మంచి కంటెంట్ దొరికింది’’ అంటూ సరదాగా ఉదయభాను (Udaya Bhanu) మీడియాను ఉద్దేశించి పంచులు పేల్చారు. ఇక వెబ్ సిరీస్ సక్సెస్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒక సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందా? అని నాకు ఇప్పుడే తెలుస్తోంది. ఈ సిరీస్‌కు అందరూ మొదటి నుంచి వందకు వంద శాతం ఎఫెర్ట్ పెట్టారు. మా సిరీస్ గురించి, మా నటన గురించి వందల, వేల మెసెజ్‌లు వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన జీ5 టీంకు థాంక్స్. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీరామ్‌కి రుణపడిపోయాను. దర్శకుడు కృష్ణ సిరీస్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. రెబెకా పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అయింది. సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. రాజీవ్ కనకాల సత్తాకు తగిన పాత్ర ఇన్నాళ్లకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంత మంచి సక్సెస్‌ను ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’’ అని అన్నారు.

Also Read- Vijay and Trisha: విజయ్-త్రిష అడ్డంగా దొరికేశారు.. ఒకే కారులో పెళ్లికి.. వీడియో వైరల్!

నేను ఎందుకు గుర్తు రాలేదో?

Advertisement

రాజీవ్ కనకాల (Rajeev Kanakala) మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్.. వారం రోజుల్లో సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందరి ఎఫర్ట్‌తోనే ఇదంతా సాధ్యమైంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ టైంలో శ్రీరామ్‌కి నేను ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ ఈ ప్రసాద్ రావు పాత్రను ఇచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచీ శ్రీరామ్ ఈ సిరీస్ విజయంపై నమ్మకంగా ఉన్నారు. రెబెకా పాత్రలో ఉదయ భాను ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ ఆమె ఎంతో డైనమిక్‌గా, పవర్ ఫుల్‌గా అనిపించారు. సిరీస్ చూసిన వారంతా కూడా కృష్ణ రాసిన కథ, తీసిన విధానం బాగున్నాయని చాలా గొప్పగా చెబుతున్నారు. సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×