E-Paper
Advertisement

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు
Advertisement

OTT Movie : ఘోస్ట్ హాంటెడ్ హారర్ స్టోరీలను చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి స్టోరీలను డిఫరెంట్ గా తీసేందుకు మేకర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాల ఫైనల్ రిజల్ట్, ప్రేక్షకులను భయపెడుతూ ఎంటర్టైన్ చేయడమే. ఓటీటీలో ఇలాంటి కంటెంట్ లకు కొదవలేదు. ఐతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మినీ సిరీస్ మంచి టాక్ తో నడిచింది. ఇది గోవాలోని ఒక హాంటెడ్ హౌస్ లో ఉండే ఒక పాత టైప్‌ రైటర్ చుట్టూ తిరుగుతుంది. అందులో ఉండే దెయ్యం, దాన్ని ఎవరైనా కదిలిస్తే ప్రాణాలు తీస్తుంటుంది. హారర్ అభిమానులకు ఇది మస్ట్ వాచ్ సిరీస్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘టైప్‌రైటర్’ (Typewriter) అనేది సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన హారర్ టెలివిజన్ సిరీస్. ఇందులో పురబ్ కోహ్లీ, పలోమి ఘోష్, జిషు సేన్‌గుప్తా, సమీర్ కొచ్చర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2019 జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 5 ఎపిసోడ్‌లతో నడిచే ఈ సిరీస్ కి ఐయండిబిలో 6.5/10 ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గోవాలోని బార్డెజ్ టౌన్‌లో ఒక పాత విల్లా, 50 ఏళ్ల నుంచి హాంటెడ్ హౌస్ అని ఫేమస్ అవుతుంది. ఆ ఇంట్లో ఒక పాత టైప్‌రైటర్ ఉంది, దాన్ని తీసుకెళ్లడానికి ఎవరైనా ట్రై చేస్తే చనిపోతుంటారు. ఇప్పుడు ఆ ఇంట్లోకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ మూరగ్, అతని వైఫ్ అనితా, కూతురు జెన్నీ అనే ఒక కొత్త ఫ్యామిలీ వస్తుంది. అదే టైమ్‌లో సామ్, జెన్నీ, ఆంకిత్ అనే ముగ్గురు చిన్న పిల్లలు, ఆ ఇంట్లో దెయ్యాన్ని క్యామెరాలో క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేస్తారు. కిడ్స్ ఇంట్లోకి సీక్రెట్‌గా ఎంటర్ అవుతారు. మొదటి రాత్రి నుంచే భయం స్టార్ట్ అవుతుంది. డోర్స్ ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. టైప్‌రైటర్ దానంతకదే టైప్ అవుతుంది.

Read Also : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్

Advertisement

 

అక్కడ ఈ పిల్లలు ఒక పాత బుక్ ను కనుగొంటారు. అందులో 50 ఏళ్ల క్రితం మ్యాన్షన్ ఓనర్ మాధవ్ మాథ్యూ టైప్‌రైటర్ కొనుగోలు చేసి, ఒక ఫకీర్‌ను ట్రాప్ చేయడానికి రిచ్యువల్ చేశాడు. కానీ ఫకీర్ ఎస్కేప్ అయి టైప్‌రైటర్‌లో చిక్కుకుని దెయ్యంగా మారాడు. ఇప్పుడు ఒక దొంగ అమిత్ రాయ్ టైప్‌రైటర్ కోసం వచ్చి చనిపోతాడు. మూరగ్ ఇన్వెస్టిగేషన్‌లో అసలు విషయాలు తెలుస్తాయి. క్లైమాక్స్‌లో పిల్లలు పెద్దలు కలిసి, టైప్‌రైటర్‌ను బర్న్ చేయడానికి ఒక రిచ్యువల్ చేస్తారు. కానీ ఫకీర్ భయంకరంగా అటాక్ చేస్తాడు. స్టోరీ ఊహించని విధంగా ముగుస్తుంది. చివరికి రిచ్యువల్ సక్సెస్ అవుతుందా ? టైప్‌ రైటర్‌ బర్న్ అవుతుందా ? ఫకీర్ దెయ్యం ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా ? అనే విషయాలను, ఈ హారర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×