E-Paper
Advertisement

OTT Movie : ఒక్క ఈవిల్ తో 12 మంది దేవతల ఫైట్… కానీ చిన్న ట్విస్ట్… కిక్కెక్కించే క్రేజీ కొరియన్ సిరీస్

OTT Movie : ఒక్క ఈవిల్ తో 12 మంది దేవతల ఫైట్… కానీ చిన్న ట్విస్ట్… కిక్కెక్కించే క్రేజీ కొరియన్ సిరీస్
Advertisement

OTT Movie : మతిపోయే విజువల్స్, అబ్బురపరిచే యాక్షన్ తో ఒక ఫాంటసీ కొరియన్ సిరీస్ ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ సిరీస్ దేవతలకు, దుష్టశక్తి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలతో మొదలవుతుంది. తూర్పు ఆసియా పురాణాలలోని 12 రాశిచక్ర జంతువుల (ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడి, కుక్క, పంది) నుండి ఈ సిరీస్ ప్రేరణ పొందింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

కథలోకి వెళ్తే

Advertisement

చాలా కాలం క్రితం 12 రాశిచక్ర దేవదూతలు, మానవాళిని రక్షించడానికి దుష్ట శక్తి తో పోరాడారు. దేవతలా గొప్ప త్యాగం ద్వారా, ఈ దుష్ట శక్తులను నరక ద్వారాలతో మూసివేసి, ప్రపంచంలో శాంతిని పునరుద్ధరించారు. అయితే శతాబ్దాల తర్వాత ఈ దుష్ట శక్తి బలం పెంచుకుంటుంది. ఈ దుష్ట శక్తులను నరక ద్వారాలు ఆపలేకపోతాయి. ఇవి మళ్ళీ భూమిపై విజృంభిస్తాయి. ముఖ్యంగా ఒక ద్వీపకల్పంలో గందరగోళం సృష్టిస్తాయి. ఈ కథ 12 దేవదూతల చుట్టూ తిరుగుతుంది. ఈ దేవతలు ఇప్పుడు మానవుల మధ్య మారువేషంలో జీవిస్తూ, ఓ-గ్వి నాయకత్వంలోని దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి తిరిగి ఒక్కటవుతారు.

ఓ-గ్వి కాకిని సూచించే శక్తివంతమైన విలన్. ప్రపంచాన్ని చీకటిలో ముంచడానికి ప్రయత్నిస్తాడు. దేవదూతలకు తే-సాన్ అనే పులి గార్డియన్ నాయకత్వం వహిస్తాడు. అతను వేల సంవత్సరాలుగా మానవాళిని రక్షిస్తూ వచ్చాడు. కానీ మానవుల ద్రోహం వల్ల నలుగురు సహచరులను కోల్పోయి, మానవ ప్రపంచానికి దూరంగా ఉంటాడు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని మళ్ళీ పోరాడటానికి వస్తాడు. ఇక వీళ్ళ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక ఈ యుద్ధంలో దేవతలకు విజయం దక్కుతుందా ? దుష్ట శక్తికి విజయం దక్కుతుందా ? అనేది ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

జియో హాట్ స్టార్ లో

‘ట్వెల్వ్’ (Twelve) కాంగ్ డే-గ్యూ, హాన్ యున్-సియోన్ దర్శకత్వంలో రూపొందిన కొరియన్ ఫాంటసీ సూపర్‌హీరో డ్రామా సిరీస్. ఈ సిరీస్‌లో మా డాంగ్-సియోక్, పార్క్ హ్యుంగ్-సిక్, సియో ఇన్-గుక్, సంగ్ డాంగ్-ఇల్, లీ జూ-బిన్, కో క్యూ-పిల్, కాంగ్ మీ-నా, సంగ్ యూ-బిన్, అన్ జి-హ్యే, రెజీనా లీ నటించారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్‌లతో, ప్రతి ఒక్కటి దాదాపు 60-70 నిమిషాల నిడివి కలిగిఉంటుంది. ఈ సిరీస్ 2025 ఆగస్టు 23 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×