E-Paper
Advertisement

Jai OTT : బిగ్ బాస్ విన్నర్ మూవీకి హయ్యెస్ట్ డిజిటల్ డీల్… ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్

Jai OTT : బిగ్ బాస్ విన్నర్ మూవీకి హయ్యెస్ట్ డిజిటల్ డీల్… ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్
Advertisement

Jai OTT : బిగ్ బాస్ కన్నడ సీజన్ 9 విజేత రూపేష్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా ‘జై’ (Jai). బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా తుళు, కన్నడ వెర్షన్ లో వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో నడిచింది కూడా. ఇది కోస్టల్ నుండి వచ్చిన తొలి తుళు సినిమాగా కూడా గుర్తింపు పొందింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ ధరకే ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇది ఏ ఓటీటీలోకి రానుంది ? దీని కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

రూపేష్ శెట్టి దర్శకత్వం వహించిన ‘జై’ సినిమా 2025 నవంబర్ 14 థియేటర్లలో విడుదలై హిట్ కొట్టింది. ఇది తుళు-కన్నడ భాషల్లో వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను Zee5కి అమ్మినట్లు రూపేష్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. దీంతో ‘జై’ త్వరలో Zee5లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండబోతోంది. అయితే తేదీ ఇంకా ప్రకటించాల్సిఉంది. ఇందులో రూపేష్, అద్వితి శెట్టి, నవీన్ డి పాడిల్, రాజ్ దీపక్ శెట్టి, దేవదాస్ కపికాడ్, అరవింద్ బోలార్, ప్రసన్న శెట్టి, మనోజ్ చేతన్ డిసౌజా, భోజరాజ్ వామంజూర్ వంటి నటులు నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సింహబెట్టు అనే కుగ్రామానికి చెందిన సత్య (రూపేష్ శెట్టి) స్థానిక ఎమ్మెల్యేకి నమ్మకస్తుడిగా ఉంటాడు. రాజకీయ నాయకుల మాటలను గుడ్డిగా నమ్ముతుంటాడు. అయితే గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల సత్య తన తండ్రిని కోల్పోతాడు. సరైన సమయంలో వైద్యం అందక జరిగిన ఈ సంఘటన అతడి కళ్లు తెరిపిస్తుంది. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే వాగ్దానాలు చేస్తారని, ప్రజల ప్రాణాల కంటే వాళ్ళకి అధికారమే ముఖ్యమని సత్య గ్రహిస్తాడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది.

తండ్రి మరణం తర్వాత సత్య ఒక సామాజిక కార్యకర్తగా మారుతాడు. తన గ్రామానికి న్యాయం జరగాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని పోరాటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో రాజకీయ నాయకుల నుంచి అతనికి సమస్యలు ఎదురవుతాయి. అన్నిటినీ ఎదుర్కొంటూ తన గ్రామంలో ఎలాంటి మార్పులు తెచ్చాడు అనేదే మిగతా కథ.

Advertisement

Read Also : కంటికి కన్పించని అద్దం నుంచి మరో ప్రపంచంలోకి… దొంగతనానికి వెళ్తే బుర్రపాడు ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×