E-Paper
Advertisement

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : ఒక హాలీవుడ్ మినీ వెబ్ సిరీస్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. కేవలం రెండు ఎపిసోడ్స్ ఉన్న ఈ కథ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఒక హైస్కూల్‌లో జరుగుతుంది. ఒక అమ్మాయి తన తన మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి, ఒక మాన్స్టర్ తో స్కూల్‌ని కంట్రోల్ చేస్తుంది. కానీ చివరకు ఆ మాన్స్టర్ తనపైనే తిరగబడుతుంది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ చూడచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘ట్రబుల్డ్ యూత్’ (Troubled Youth) అమెరికన్ హారర్ మినీ సిరీస్. ఎమిలీ డెల్ డైరెక్ట్ చేసిన షార్ట్ హారర్ సిరీస్. మొత్తం 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో కామి స్టార్మ్ (ఎవా), నెఖబెట్ కుమ్ జూచ్ (క్యాథరిన్), గార్డన్ టార్ప్లీ (జాక్), క్రిస్టియన్ వెంటురా (అలెక్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2018 జనవరి 19 న YouTube, Crypt TV ఛానల్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో దీనికి 6.0/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక అమెరికన్ హైస్కూల్‌లో ఎవా అనే అమ్మాయి చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఆమెకు సైకిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆమె స్కూల్‌లో అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఎవా దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది. క్యాథరిన్ అనే లైబ్రేరియన్ ను ఒక మాజిక్ నెక్లెస్ ద్వారా ఎవా కంట్రోల్ చేస్తుంటుంది. క్యాథరిన్ ఆ నెక్లెస్ వల్ల మాన్స్టర్‌గా మారుతుంది. ఎవా ఈ మాన్స్టర్‌ని తన ‘పెట్ గా ఉపయోగించి, స్కూల్‌లో బలహీనమైన వాళ్లను టార్గెట్ చేస్తుంది. ఆమె “వుల్వ్స్” అనే బలమైన గ్రూప్‌ని స్టార్ట్ చేసి, స్కూల్‌ని రూల్ చేయాలనుకుంటుంది. ఆమె బలహీనమైన స్టూడెంట్స్‌ని “షీప్” అని, బలమైన వాళ్లని “వుల్వ్స్” అని పిలుస్తుంది.

Read Also : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

ఒక రోజు జాక్ అనే బాయ్‌ని ఎవా టార్గెట్ చేస్తుంది. జాక్ స్కూల్‌లో బలహీనంగా ఉంటాడు. ఎవా మాజిక్ నెక్లెస్‌తో క్యాథరిన్ ని మాన్స్టర్‌గా మార్చి, జాక్‌ని అటాక్ చేయిస్తుంది. ఈ అటాక్ లో జాక్‌ చనిపోతాడు. ఎవా తన “వుల్వ్స్” గ్రూప్‌ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. స్కూల్‌లో అందరూ ఆమెకు భయపడతారు. ఇక ఎవా మరి కొంతమంది స్టూడెంట్స్‌ని టార్గెట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆమె స్కూల్‌లో ఫుల్ కంట్రోల్ లో  తీసుకోవాలనుకుంటుంది. కానీ ఎవా, క్యాథరిన్ ని ఈ సారి కంట్రోల్ చేయలేక పోతుంది. క్యాథరిన్ మాజిక్ నెక్లెస్‌ని బ్రేక్ చేసి, ఎవా మీద అటాక్ చేస్తుంది. ఈ అటాక్ నుంచి ఎవా బయట పడుతుందా ? క్యాథరిన్ కి బలవుతుందా ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×