E-Paper
Advertisement

Jio Hotstar : జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ మూవీస్.. టాప్ 5 సినిమాలు ఇవే..

Jio Hotstar : జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ మూవీస్.. టాప్ 5 సినిమాలు ఇవే..
Advertisement

Jio Hotstar : ప్రతివారం సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. కరోనా సమయంలో ఎన్నో ఓటిటి సంస్థలు పుట్టుకొని వచ్చాయి. అందులో ముఖ్యంగా వినిపించే పేరు జియో హాట్ స్టార్.. డిస్నీ హాట్ స్టార్ గా ఉన్న ఈ ప్లాట్ఫారం జియోతో టైఅప్ అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త సినిమాలకు కొదవ లేకుండా చేస్తుంది. బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తూనే ఉంటాయి.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. వేరే భాషల్లో సినిమాలను కూడా అందిస్తుంది. ఈ నెలలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అందులో టాప్ ఫైవ్ వ్యూస్ ని అందుకున్న సినిమాలేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

భద్రకాళీ.. 

తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ చిత్రం భద్రకాళి. థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది.. అక్టోబర్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన మూవీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా వీక్షిస్తున్నారు. దాంతో ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే టాప్ 2 ప్లేస్ లోకి రావడం విశేషం..

హార్ట్ బీట్ సీజన్ 2.. 

Advertisement

తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ హాట్ బీట్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. మొదటి సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రస్తుతం ప్రసారమవుతుంది. ప్రతి వారం 4 ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తుంటారు మేకర్స్..హాట్‌స్టార్‌లో టాప్ 3 స్థానంలో హార్ట్ బీట్ సీజన్ 2 ట్రెండింగ్‌లో ఉంది..

మిరాయ్.. 

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం మిరాయ్.. థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తుంది. మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ లోనే కొనసాగుతుంది. టాప్ 4 ఉంది.

పోలీస్ పోలీస్.. 

Advertisement

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో వెబ్ సిరీస్ పోలీస్ పోలీస్.. పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుంది. క్రిమినల్స్ ని ఎలా పట్టుకోవాలి అని కదా అంశంతో ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఉంటుంది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ వ్యూస్ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఇది ఉండడం విశేషం..

Also Read :బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

ఇవే కాదు బిగ్ బాస్ టాప్ వన్ లో కొనసాగుతుంది. తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుంది. దాంతో మంచి వ్యూస్ ని రాబడుతుంది. ఇలా మరికొన్ని షోలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాని లేదా వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×