E-Paper
Advertisement

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్
Advertisement

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కల్చర్ ని, ఒక గ్రిప్పింగ్ స్టోరీతో తెరమీదకి తీసుకొచ్చారు తమిళ దర్శకుడు నవీన్ ఉన్ని. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ స్టోరీ ఉహించని ట్విస్టులతో సైకలాజికల్ టెన్షన్ ను పెట్టిస్తుంది. ఇందులో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంట రియాలిటీ షోలో అడుగుపెడతారు. ఆ తరువాతా స్టోరీ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

కథలోకి వెళ్తే

Advertisement

చెన్నైలో అర్జున్, మీరా ఒక పాపులర్ యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ జంట. 3 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లతో గొప్ప జీవితాన్ని గడుపుతుంటారు. లగ్జరీ ఇల్లు, కొత్త లైఫ్ స్టైల్ తో హ్యాపీగా ఉంటారు. కానీ ఒక రోజు వారి యూట్యూబ్ ఛానెల్ పడిపోతుంది. వారి ఆదాయం ఆగిపోతుంది, అప్పులు పేరుకుపోతాయి. ఆర్థిక పరిస్థితులలో వీళ్ళ సంబంధంలో సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో, ఒక వ్యక్తి “మాస్క్” అనే పేరుతో వీళ్ళను సంప్రదించి, ఒక విచిత్రమైన రియాలిటీ షోలో పాల్గొనమని ఆహ్వానిస్తాడు. దీని వల్ల భారీగా నగదు వస్తుందని వాగ్దానం చేస్తాడు. డబ్బు కోసం అర్జున్, మీరా దీనికి ఒప్పుకుంటారు. అయితే ఈ గేమ్ డబ్బు కోసం మాత్రమే కాదు, వారి సంబంధాన్ని పరీక్షించే ఒక సైకలాజికల్ ట్రాప్ అని తెలుసుకుంటారు.

రియాలిటీ షోలో “మాస్క్” వీళ్ళ వ్యక్తిగత రహస్యాలను బయటపెడుతూ, అర్జున్, మీరాను మానసికంగా ఒత్తిడికి గురిచేసే గేమ్‌లను రూపొందిస్తాడు. ఈ గేమ్‌లు వారి నమ్మకాన్ని, ప్రేమను పరీక్షిస్తాయి. వీళ్ళ సంబంధంలో దాగిన రహస్యాలు, అబద్ధాలు, ద్రోహం బయటపడతాయి. ఇప్పుడు అర్జున్, మీరా ఒకరినొకరు అనుమానించడం ప్రారంభిస్తారు. క్లైమాక్స్‌లో “మాస్క్” అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడనే విషయం బయటపడుతుంది. ఇక అర్జున్, మీరా తమ సంబంధాన్ని కాపాడుకోవడానికి లేదా విడిపోవడానికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? వీళ్ళు దాచిన రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ట్రెండింగ్’ (Trending) 2025లో విడుదలైన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. నవీన్ ఉన్ని దర్శకత్వంలో, కలైయరసన్ (అర్జున్), ప్రియలయ (మీరా), రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 147 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ చిత్రం IMDbలో 7.2/10 రేటింగ్ ను పొందింది.

Read Also : అయ్యయ్యో పెంచిన వింత జంతువుతోనే ఆ పాడు పని… జెండర్ మార్చుకుని అది చేసే అరాచకం చూస్తే దిమాక్ ఖరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×