E-Paper
Advertisement

OTT Movie : సెన్సార్ కూడా చేయని మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని ఘోరమైన మూవీ

OTT Movie : సెన్సార్ కూడా చేయని మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని ఘోరమైన మూవీ
Advertisement

OTT Movie : సినిమాలు రాకరకాల కంటెంట్ తో వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, అమ్మాయిలను అంత క్రూరంగా చంపుతారు. వాళ్ళపై అఘాయిత్యం చేస్తూ చంపుతారు. ఈ సన్నివేశాలు చూడాలంటే కూడా ఒళ్ళు జలదరిస్తుంది. వాళ్ళ ప్రతీకార సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాను గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే కలలోకి కూడా వచ్చే అవకాశం ఉంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..

ప్లెక్స్ (Plex) లో

Advertisement

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు’ట్రామా’ (Trauma). 2017 లో చిలీ నుంచి వచ్చిన ఈ మూవీకి లూసియో ఎ. రోజాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిలీ చరిత్రలోని అత్యంత చీకటి దశ అయిన, పినోచెట్ నియంత (1973-1990) ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. హింస, భయంకరమైన అంశాలతో ఈ స్టోరీ నిండి ఉంటుంది. హింస అంటే ఇలా కూడా ఉంటుందా అనే రీతిలో చూపించారు.  ఈ మూవీ ప్లెక్స్ (Plex) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

నలుగురు స్నేహితులు ఆండ్రియా, కామిలా, టినా, మాగ్డలీనా చిలీలోని ఒక గ్రామీణ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్తారు. వారు ఒక పాడుబడిన ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ముచ్చట్లు చెప్పుకుంటూ,సంతోషంగా ఉంటారు. అయితే ఈ సంతోషం ఎక్కువసేపు ఉండదు.  ఇంతలో జువాన్ అనే ఒక వ్యక్తి , అతని కుమారుడు మారియో అక్కడికి వచ్చి వారిపై దాడి చేస్తారు. ఈ దాడిలో ఒకరు మరణిస్తారు, మరికొందరు తీవ్రంగా గాయపడతారు. ఆ తండ్రి కొడుకులు వాళ్ళపై దారుణమైన రీతిలో అఘాయిత్యానికి పాల్పడుతారు. ఆతరువాత ఆ గ్రామంలో సహాయం కోసం వెతుకుతున్నప్పుడు, వారికి ఎటువంటి సహాయం దొరకదు. ఆ దాడి చేసిన వ్యక్తులు స్థానికంగా ఉండే వారని తెలుస్తుంది. వాళ్ళు భయంకరమైన నెరస్తులుగా ఉంటారు.  ఆ తరువాత, ఇద్దరు పోలీసుల సహాయంతో బాధితులు జువాన్, మారియోలను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు.

అయితే, ఈ క్రమంలో జువాన్, మారియోలు పినోచెట్ హయాంలో జరిగిన హింసాత్మక చర్యలతో వీళ్ళకు కూడా సంభంధం ఉందని తెలుసుకుంటారు. వారి కుటుంబం తరతరాలుగా దారుణమైన నేరాలకు పాల్పడిందని బయటపడుతుంది. ఈ రెండు పాత్రలు అత్యంత క్రూరమైన, సాడిస్టిక్ స్వభావం కలిగి ఉంటాయి. ఇది ఈ మూవీలో దారుణమైన హింసాత్మక సన్నివేశాల ద్వారా చూపిస్తారు.  ఆ బాధిత అమ్మాయిలు జువాన్, మారియోను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి క్రూరత్వం ముందు ఆపని చేయలేకపోతారు. ఈ పోరాటంలో మిగిలిన వాళ్ళు కూడా దారుణంగా చంపబడతారు. వాళ్ళను వేటాడి మరీ చంపుతారు. మారియో, జువాన్ ల ఆరాచకాలు అలాగే కొనసాగుతాయి. చివరికి వాళ్ళను ఎవరైనా అడ్డుకుంటారా ? అనేది సినిమా చూసి తెలుసుకోండి. ఈ మూవీ హింస, లైంగిక దాడి, భయంకరమైన సన్నివేశాలతో నిండి ఉంటుంది.

Read Also :https://www.bigtvlive.com/ott/maharaj-movie-streaming-on-netflix-2.html

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×