// // పోలీసుల కళ్లుగప్పి వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్... -->
E-Paper
Advertisement

పోలీసుల కళ్లుగప్పి వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

పోలీసుల కళ్లుగప్పి వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Thriller movie OTT; Netflixలో ప్రస్తుతం భారీ సంచలనం సృష్టిస్తోంది M. Night Shyamalan దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ “Trap”. జోష్ హార్ట్‌నెట్ నటించిన ఈ చిత్రంలో ఒక సాధారణ తండ్రి-కూతురు బంధాన్ని తీసుకుని, దాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా రూపొందించారు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? సినిమాలోని హైలెట్స్ ఏంటి ? స్టోరీ ట్విస్టులతో ఎలా సాగుతుంది ? అన్నది వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలోని ప్రధాన పాత్ర కూపర్ (జోష్ హార్ట్‌నెట్). అతనే మన హీరో. అతను ఒక సాధారణ తండ్రి. తన 12 ఏళ్ల కూతురు రైలీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఇష్టమైన పాప్ స్టార్ లేడీ రేవెన్ కాన్సర్ట్‌ కి టికెట్లు తీసుకుపోతాడు. కాన్సర్ట్ జరుగుతున్న సమయంలోనే ఆకస్మికంగా పోలీసు ఆపరేషన్ మొదలవుతుంది. ఆ స్టేడియం‌ను పోలీసులు చుట్టుముట్టి, ఒక సీరియల్ కిల్లర్‌ ను పట్టుకోవడానికి ఆపరేషన్ నడుపుతున్నారని తెలుస్తుంది. కూపర్ మొదట్లో సాధారణ తండ్రిలాగానే ప్రవర్తిస్తాడు. కానీ నెమ్మదిగా అతనికి ఒక భయంకరమైన నిజం బయట పడుతుంది. ఆ సీరియల్ కిల్లర్ అతనే అనేది ఇక్కడ రివీల్ అయ్యే బిగ్ ట్విస్ట్. పోలీసులు ఆ స్టేడియం‌ను ట్రాప్‌ గా ఉపయోగించి అతన్ని పట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఇక్కడి నుంచి సినిమా అసలైన ఇంటెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది.

Advertisement

కూపర్ తన కూతురు రైలీని ఎలాగైనా ఆపరేషన్ నుంచి బయట పడేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకవైపు తన నేరాల గతం, మరోవైపు కూతురి మీద ఉన్న ప్రేమ. ఈ రెండింటి మధ్య అతను చిక్కుకుపోతాడు. రైలీ తన తండ్రిని గురించి ఏమీ తెలియని దానిలా ప్రవర్తిస్తుంటుంది. ఈ దృశ్యాలు చాలా ఎమోషనల్‌గా, అదే సమయంలో టెన్షన్‌తో నిండి ఉంటాయి. మరి హీరో తన కూతురిని ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయట పడేశాడు ? అతను పోలీసులకు దొరికాడా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది స్టోరీ.

ఏ ఓటీటీలో ఉందంటే ?

M. Night Shyamalan స్టైల్‌లో సినిమా చివరి వరకు మంచి ట్విస్టులతో కొనసాగుతుంది. కూపర్ ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు ? పోలీసులు ఎలా అతన్ని ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తారు ? మధ్యలో ఎన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి ? అనేది చాలా తెలివిగా రూపొందించారు. సినిమా పూర్తిగా ఒకే లొకేషన్ (కాన్సర్ట్ స్టేడియం) చుట్టూ సాగినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. జోష్ హార్ట్‌నెట్ అద్భుతమైన నటన, సస్పెన్స్, స్మార్ట్ ట్విస్టులు, తండ్రి-కూతురు బంధం చూపించిన విధానం, శ్యామలన్ స్టైల్ ఎండింగ్ సినిమాలో బాగుంటాయి. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది.

Advertisement

Read Also : ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×