E-Paper
Advertisement

Top Hero OTT Debut : హీరో నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేస్తే… ఏడేళ్ళ క్రితమే ఆగిపోయిన సిరీస్… ఇన్నేళ్ల తరువాత అప్డేట్

Top Hero OTT Debut : హీరో నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేస్తే… ఏడేళ్ళ క్రితమే ఆగిపోయిన సిరీస్… ఇన్నేళ్ల తరువాత అప్డేట్
Advertisement

Top Hero OTT Debut : డిజిటల్ స్క్రీన్ ఇప్పుడు కొత్తవారికే కాకుండా, ప్రముఖ నటులకు కూడా వేదికగా మారింది. బాబీ డియోల్, నుండి షాహిద్ కపూర్ వరకు బిగ్ స్క్రీన్ చిత్రాలకే పరిమితం కాకుండా, 7-8 ఎపిసోడ్ల  వెబ్ సిరీస్‌లలో కూడా చురుకుగా పనిచేస్తున్నారు. వీళ్ళు నటిస్తున్న సిరీస్ లు రికార్డ్ వ్యూస్ తో కూడా  నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేసి, నిలిచిపోయిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. గత ఏడు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందుకు నిలిచిపోయింది ? వార్తల్లో ఇప్పుడు ఎందుకు నిలిచింది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

7 సంవత్సరాల క్రితం మొదలు

అమెజాన్ ప్రైమ్ వీడియో 2019లో అక్షయ్ కుమార్ తో ఒక వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్‌కు “ది ఎండ్” (The end) అని పేరు కూడా పెట్టారు. అక్షయ్ కుమార్ మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ ప్రకటన అప్పట్లో మారుమోగింది. అయితే అప్పుడు COVID-19 మహమ్మారి కారణంగా చాలా మంది పెద్ద స్టార్లు నటించిన వెబ్ సిరీస్‌లు అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ దేవ్‌గన్, రవీనా టాండన్ వంటి నటుల కొన్ని డిజిటల్ ప్రాజెక్టులు విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ “ది ఎండ్” కూడా నిలిచిపోయింది. క్రమంగా ఈ సిరీస్ ఆగిపోయిందని, ఇక అక్షయ్ కుమార్ డిజిటల్ డెబ్యూ సిరీస్ ఎప్పటికీ పూర్తి కాదని అభిమానులు సైతం అనుకున్నారు. కాని ఇప్పుడు నిర్మాత విక్రమ్ మల్హోత్రా ప్రకటనతో ఇది వార్తల్లో నిలిచింది.

ఈ ఏడాది షూటింగ్ షురూ

Advertisement

అయితే అందరి ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, షో నిర్మాత విక్రమ్ మల్హోత్రా “ది ఎండ్” ఎప్పుడూ వాయిదా వేయలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు సాగనుందని, అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా షో స్క్రిప్ట్‌ను తిరిగి రూపొందిస్తున్నట్లు విక్రమ్ వివరించాడు.ఈ సిరీస్ ప్రేక్షకులకు తగ్గట్టు కొత్త కంటెంట్ తో రాబోతోందని, కాబట్టి దీనికి కొంత సమయం పడుతోందని చెప్పారు. ఇక ఈ సిరీస్ షూటింగ్ ఈ ఏడాది జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది కలిసొచ్చినట్లేనా

గత కొన్ని సంవత్సరాలుగా అక్షయ్ కుమార్ కు సినిమాల పరంగా అంత బాగా లేదు. కానీ 2026 అతనికి కలిసొచ్చేటట్టే ఉంది. అతని “వెల్‌కమ్ టు ది జంగిల్” చిత్రం ఈ సంవత్సరం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ దానిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కూడా. ఇక ఈ ఏడాది అక్షయ్ తన మొదటి వెబ్ సిరీస్ షూటింగ్ కూడా త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. ఇప్పుడు అతని కొత్త షో, “వీల్ ఆఫ్ ఫార్చ్యూన్”, 2026 జనవరి 27 నుంచి ప్రీమియర్ కానుంది. ఇందులో ప్రముఖ నటులు సందడి చేయనున్నారు.

Advertisement

Read Also : పొరపాటున కాలంలో వెనక్కెళ్ళే కుర్రాడు… క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ… అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×