// // K-Dramas Releasing in June 2026 : జూన్లో రాబోతున్న కొరియన్ డ్రామాలు -->
E-Paper
Advertisement

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

K-Dramas Releasing in June 2026 : కొరియన్ సిరీస్‌ల (K-Dramas)పై భారతీయ యువత, ముఖ్యంగా యువతుల్లో ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని రకాల కంటెంట్‌ తో జూన్ 2026లో కొత్త కొరియన్ సిరీస్‌ లు ఓటీటీలో వస్తున్నాయి. ఈ వారం కె డ్రామా ప్రియులు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 6 అప్‌కమింగ్ కొరియన్ డ్రామాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. Doctor on the Edge (డాక్టర్ ఆన్ ది ఎడ్జ్)

‘ఎండ్యూరెన్స్ డాక్టర్’ అనే పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ రొమాంటిక్ కామెడీ ‘డాక్టర్ ఆన్ ది ఎడ్జ్’. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మిలిటరీ సర్వీస్‌ లో భాగంగా ఒక మారుమూల ద్వీపానికి పబ్లిక్ హెల్త్ డాక్టర్‌ గా వెళ్తాడు. అక్కడ ఒక నర్సును కలుసుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇందులో లీ జే-వుక్, షిన్ యే లీడ్ రోల్స్‌లో నటించారు.
విడుదల తేదీ : జూన్ 1
ప్లాట్‌ఫామ్ : Jio Hotstar

2. Teach You A Lesson (టీచ్ యు ఎ లెసన్)

Advertisement

హై-వోల్టేజ్ యాక్షన్ స్కూల్ డ్రామా ‘టీచ్ యు ఎ లెసన్’. పాఠశాలల్లో పెరిగిపోతున్న హింస, ర్యాగింగ్‌ లను అరికట్టడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తుంది. ఆకతాయిలను ఈ బృందం ఎలా అణచి వేస్తుందనేది ఈ డార్క్ సిరీస్ కథ. కిమ్ మూ-యుల్, లీ సుంగ్-మిన్, జిన్ కి-జూక్ ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు.
విడుదల తేదీ : జూన్ 5
ప్లాట్‌ఫామ్ : Netflix

3. The Lie We Lived In (ది లై వి లివ్డ్ ఇన్)

సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ, హత్య కాంట్రాక్ట్, డిటెక్టివ్ ఎంట్రీతో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. కిమ్ సంగ్-బియోమ్, కిమ్ గ్యోంగ్-మిన్, లీ జియాంగ్-హో నటించారు.
విడుదల తేదీ: జూన్ 5, 2026
ప్లాట్‌ఫారమ్: Rakuten Viki & Wavve

4. See You at Work Tomorrow (సీ యూ ఎట్ వర్క్ టుమారో!)

Advertisement

ఆఫీస్ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే స్లో-బర్న్ రొమాంటిక్ కామెడీ డ్రామా. కెరీర్‌ లో విసిగిపోయిన ఒక ప్రొడక్ట్ ప్లానర్, తన కొత్త కఠినమైన బాస్‌ తో కలిసి పని చేయాల్సి వస్తుంది. మొదట గొడవలు మెల్లగా ప్రేమగా మారే కథ ఇది. సియో ఇన్-గుక్, పార్క్ జి-హ్యూన్, కాంగ్ మి నటించారు.
విడుదల తేదీ : జూన్ 22
ప్లాట్‌ఫారమ్ : Amazon Prime Video

Also Read : తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

5. Notes from the Last Row (నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో)

మైండ్-బెండింగ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో’. ఒక లిటరేచర్ ప్రొఫెసర్ తన క్లాస్‌ లో చివరి బెంచీలో కూర్చునే విద్యార్థి రాసిన కథల్లో నిజ జీవిత సంఘటనలు ప్రతిబింబించడంతో కథ ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటుంది.
విడుదల తేదీ : జూన్ 26
ప్లాట్‌ఫారమ్ : Netflix

6. Agent Kim Reactivated (ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్)

‘మేనేజర్ కిమ్’ వెబ్‌టూన్ ఆధారంగా వచ్చిన యాక్షన్ రివెంజ్ డ్రామా ‘ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్’. గతంలో ఎలైట్ కోవర్ట్ ఏజెంట్‌ గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్‌ గా, ఒంటరి తండ్రిగా జీవితం గడుపుతాడు. కూతురు కిడ్నాప్ అవడంతో మళ్లీ పాత ప్రపంచంలోకి వెళ్తాడు. జాన్ విక్ స్టైల్ యాక్షన్ ఉంటుంది ఇందులో.
విడుదల తేదీ : జూన్ 26
ప్లాట్‌ఫారమ్ : నెట్ ఫ్లిక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×