E-Paper
Advertisement

‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్
Advertisement

Hollywood OTT Releases June 2026 : జూన్ మొదటి వారం ఓటీటీ ప్రియులకు ఎంజాయ్ పండగో అన్నట్టు ఉంది. హాలీవుడ్ నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ చిత్రాలు డిజిటల్‌ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, డాక్యుమెంటరీ.. ఇలా అన్ని రకాల జానర్ల సినిమాలు, సిరీస్ లు ఆ లిస్ట్ లో ఉండడం గమనార్హం. ఇంట్లోనే కూర్చుని ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఈ వీకెండ్. మరి ఈ వారం చూడాల్సిన టాప్ 6 హాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ (Masters of the Universe)

1980ల నాటి ప్రసిద్ధ సూపర్ హీరో హీ-మ్యాన్ కథను కొత్త తీరులో తెరకెక్కించారు. నికోలస్ గలిట్జైన్ హీ-మ్యాన్‌గా, జారెడ్ లెటో స్కెలేటర్‌గా నటించారు. ఫాంటసీ యాక్షన్ ఇష్టపడేవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. జూన్ 5న విడుదలవుతోంది.

2. స్కేరీ మూవీ (Scary Movie)

Advertisement

షాన్ వేయన్స్, మార్లన్ వేయన్స్, అన్నా ఫారిస్ వంటి స్టార్లతో వచ్చిన హారర్ కామెడీ ఈ మూవీ. పాత హారర్ సినిమాలను హాస్యంగా అనుకరించి చూపించే ఈ సినిమా నవ్వులు పంచుతుంది. జూన్ 5న వస్తోంది.

Also Read : ఒకే ఓటీటీలో 15 సినిమాలు… తెలుగులో 8… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

3. పవర్ బల్లాడ్ (Power Ballad)

Advertisement

పాల్ రడ్, నిక్ జోనాస్ నటించిన మ్యూజికల్ కామెడీ డ్రామా. పెళ్లి పాటలు పాడే ఒక గాయకుడు ఒక బాయ్-బ్యాండ్ స్టార్‌ తో స్నేహం చేసి తన కెరీర్‌ ను తిరిగి పుంజుకోవడం గురించి ఈ సినిమా. జూన్ 5న విడుదల కానుంది.

4. ఆఫీస్ రొమాన్స్ (Office Romance)

జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టెయిన్ నటించిన రొమాంటిక్ కామెడీ. ఒక కంపెనీ CEO కొత్త ఉద్యోగితో ప్రేమలో పడి జీవితం తలక్రిందులైన కథ. ఆఫీస్ లవ్ స్టోరీ ఇష్టపడేవాళ్లకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్. జూన్ 5న వస్తోంది.

Also Read : 2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

5. కేప్ ఫియర్ (Cape Fear)

జేవియర్ బార్డెమ్, అమీ ఆడమ్స్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. జైలు నుంచి వచ్చిన ఒక మానసిక రోగి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక జంటను ఎలా భయపెడతాడు అనేది కథ. Apple TV+లో జూన్ 5న వస్తోంది.

6.. మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్ (Michael Jackson: The Verdict)

దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ జీవితం, ఆయనపై వచ్చిన ఆరోపణలు, కేసులు.. అన్నీ వివరంగా చూపించే డాక్యుమెంటరీ సిరీస్ ఇది. Netflixలో జూన్ 3న విడుదలవుతోంది.

Read Also : కంటైనర్ లో కాళ్ళూ చేతులు కట్టేసిన స్థితిలో దొరికే మహిళ… అంతు చిక్కని వింత మిస్టరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×