// // Spy Thriller OTT : హై-ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ముఠా -->
E-Paper
Advertisement

హై-ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ముఠా… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్

హై-ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ముఠా… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్
Advertisement

Spy Thriller OTT : ఓటీటీలో వెతకాలే గానీ ఆణిముత్యాలు అన్పించే సినిమాలు ఎన్నో దొరుకుతాయి. కాకపోతే ఇప్పటికే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న సినిమాలలో అలాంటి మంచి సినిమాలను వెతకడం అంటే కత్తిమీద సామే. ముఖ్యంగా స్పై, యాక్షన్, సస్పెన్స్ కలగలిపి ఉన్న సినిమాలు దొరకడం చాలా కష్టం. మీకు కూడా ఇలాగే అనిపిస్తోందా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు Tom Clancy’s Jack Ryan: Ghost War (2026). నాలుగు సీజన్ల విజయవంతమైన వెబ్ సిరీస్ తర్వాత, జాక్ ర్యాన్ ఫ్రాంచైజ్ ఈ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఆండ్రూ బెర్న్‌స్టెయిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 105 నిమిషాల రన్ టైంతో ఉంటుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 మే 20న ప్రపంచవ్యాప్తంగా Amazon Prime Videoలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే… వెబ్ సిరీస్ తరహాలో స్లో-బర్న్ పాలిటిక్స్ లా ఉండదు. రియల్-టైమ్ కథనంతో అత్యంత వేగంగా, భారీ యాక్షన్ సీన్లతో పరుగులు తీస్తుంది.

Advertisement

Also Read : గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

మన హీరో జాక్ ర్యాన్ సీఐఏ ను వదిలేసి ఉంటాడు. మిగిలిన లైఫ్ ను ప్రశాంతంగా గడపాలి అనుకుని సివిలియన్ ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక అంతర్జాతీయ విపత్తు కారణంగా మళ్లీ అతను స్పై ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. దుబాయ్‌లో జరిగిన ఒక సీక్రెట్ సర్వైలెన్స్ మిషన్ ఘోరంగా విఫలం అవుతుంది. ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక భారీ అంతర్జాతీయ కుట్ర గురించి తెలుస్తుంది. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ జేమ్స్ గ్రీర్ మళ్లీ జాక్ సాయం కోరడంతో ఆయన రీఏంటి ఇస్తాడు. అయితే ఇన్వెస్టిగేషన్ లో జాక్ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

Advertisement

Also Read : ఏం సిరీస్ గురూ… కలలోనూ వెంటాడే సీన్లున్న కొరియన్ సిరీస్

గతంలో ఓ మిషన్ లో ‘స్టార్లింగ్’ (Starling) అనే ఒక అనధికారిక రోగ్ బ్లాక్-ఆప్స్ విభాగాన్ని హీరో అంతం చేస్తాడు. కానీ అది మళ్లీ ప్రాణం పోసుకుందని ఇన్వెస్టిగేషన్ లో బయట పడుతుంది. సైకలాజికల్ వార్‌ఫేర్, హై-ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ఈ ముఠా ప్రతి కదలికను ముందే ఊహించి, సీఐఏ నెట్‌వర్క్‌ ను దెబ్బతీస్తుంది. మరి ఈ ముఠాను జాక్ ఎలా ఎదుర్కొన్నాడు ? విలన్ నడుపుతున్న ఈ రోగ్ యూనిట్ ఆట కట్టించడానికి హీరో ప్రాణాలను పణంగా పెట్టి ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా ముగింపు.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×