E-Paper
Advertisement

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : కన్నడ ఇండస్ట్రీలో రాజ్ బి షెట్టికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇతను నటించిన సినిమాలలో ఒక్కటి చూసినా ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయట పెట్టాడు రాజ్. ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. టోబి అనే ఒక మూగ పాత్రలో జీవించాడానే చెప్పుకోవాలి. ఒక బీస్ట్ గా ఉండే టోబి తన దత్తపుత్రిక జెన్నీ కోసం మారాలనుకుంటాడు. అయితే స్టోరీ మరోలా నడుస్తుంది. రివేంజ్ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు, ముఖ్యంగా రాజ్ బి షెట్టి అభిమానులకు మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘టోబి’ (Toby) 2023లో వచ్చిన కన్నడ యాక్షన్ మూవీ. బేసిల్ అల్చలక్కల్ దర్శకత్వంలో రాజ్ బి షెట్టి మెయిన్ రోల్ లో నటించగా, సమ్యుక్త హొర్నాడ్, చైత్ర జె అచార్, రాజ్ దీపక్ షెట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఆగష్టు 25న థియేటర్లలోరిలీజ్ అయింది. ప్రస్తుతం. సోనిలివ్ (SonyLIV)లో కన్నడ ఒరిజినల్ వెర్షన్‌ను తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.155 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.2/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఉత్తర కన్నడ జిల్లాలోని కుమ్టా టౌన్‌లో టోబి (రాజ్ బి షెట్టి) అనే మూగ వ్యక్తి మోర్చురీలో పని చేస్తూ ఒంటరిగా జీవిస్తుంటాడు. ఊరు వాళ్లు అతడ్ని బీస్ట్ అని పిలుస్తుంటారు. అతన్ని చూస్తేనే అందరూ భయపడుతుంటారు. అతను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు. అతనికి కోపం కూడా ఎక్కువే. ఎవరి మాట వినడు. ఒక రోజు అతను అనాథ శిశువు జెన్నీని దగ్గరకు తీసుకుని పెంచుతాడు. అతనికి సావిత్రి అనే సె*క్స్ వర్కర్‌తో లవ్ డెవలప్ అవుతుంది. డామోదర్ అనే వ్యక్తి ఫ్రెండ్‌షిప్‌తో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ టోబిని ఆ ఊరి పెద్ద ఆనంద్ తన అక్రమ పనులకు ఉపయోగించుకుంటాడు. ఈ సమయంలో జెన్నీకూడా పెద్దది అవుతుంది. ఆనంద్ జెన్నీపై కన్ను వేస్తాడు. జెన్నీని బలవంతం చేసి ఆమె లైఫ్‌ని డిస్ట్రాయ్ చేస్తాడు. అతనితో పాటు అతని అనుచరులు కూడా ఈ దుర్మార్గంలో పాలు పంచుకుంటారు. ఆ తరువాత ఆమెను మర్డర్ చేస్తారు.

Read Also :  కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

ఈ సంఘటన టోబిని పూర్తిగా మార్చేస్తుంది. అతనిలో ఉండే మృగం బయటికి వస్తుంది. సవిత్రి సపోర్ట్‌తో టోబి రివెంజ్ మోడ్ ఆన్ చేస్తాడు. ఇప్పుడు బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్‌లు స్టార్ట్ అవుతాయి. టోబి ఒక్కొక్కరిని ట్రాక్ చేసి బీస్ట్ మోడ్‌లో చంపడం మొదలుపెడతాడు. ఫుల్ బ్లడ్ బాత్ తో రివెంజ్ జర్నీ కొనసాగుతుంది. ఫ్లాష్‌ బ్యాక్స్‌లో టోబి పాస్ట్ రివీల్ అవుతుంది. జెన్నీతో బాండ్ ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. ఫైనల్‌లో ఆనంద్‌తో క్లైమాక్స్ ఫైట్ భీకరంగా సాగుతుంది. చివరికి ఆనంద్‌ ని టోబి మట్టుబెడతాడా ? జెన్నీకి జస్టిస్ ఇస్తాడా ? టోబి గతం ఏమిటి ? అనే విషయాలను, ఈ కన్నడ యాక్షన్ మూవీని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×