E-Paper
Advertisement

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఇప్పుడు ఏ భాషలో చూసినా థ్రిల్లర్ కంటెంట్ ని ఎక్కువగా ఆదరిస్తునారు ప్రేక్షకులు. రకరకాల ట్విస్టులతో స్టోరీని ఉత్కంఠంగా నడిపిస్తునారు. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంటాయి. హాలీవుడ్ కంటెంట్ లో అయితే హింస కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ పీక్స్ లో ఉంటాయి. ఈ కథ భార్య చావుకి ప్లాన్ చేసి, భర్త సూసైడ్ చేసుకుంటాడు. ఆ తరువాత ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది టిల్ డెత్’ (Till death) 2021లో వచ్చిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. S.K. డేల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మెగాన్ ఫాక్స్, కాలన్ మల్వే, జేసీ ఉషర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 జూలై 2న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. IMDb లో దీనికి 5.9/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఎమ్మా అనే మహిళ తన భర్త మార్క్ తో ఒక లేక్ హౌస్‌లో రొమాంటిక్ వీకెండ్ కోసం వస్తుంది. వాళ్ల పెళ్లి రోజు సందర్భంగా, ఎమ్మాకు మార్క్ ఒక గోల్డెన్ బ్రెస్లెట్ ని గిఫ్ట్ గా కూడా ఇస్తాడు. అయితే ఆ రోజు రాత్రి, మార్క్ ఎమ్మా చేతిని తన చేతికి హ్యాండ్‌ కఫ్స్‌తో లాక్ చేస్తాడు. ఇది ప్రేమకి సింబల్ అని చెబుతాడు. కానీ ఉదయానికి మార్క్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఎమ్మా షాక్ అవుతుంది. ఆమె చేయి మార్క్ శవంతో హ్యాండ్‌ కఫ్స్‌లో చిక్కుకుంటుంది. ఆమె ఫోన్ కూడా అక్కడ కనిపించదు. ఇక ఇంట్లో ఒంటరిగా ఉండిపోతుంది. ఈ ఇళ్ళు ఊరికి దూరంగా ఉండటంతో గందరగోళంలో పడుతుంది. ఆ తరువాత ఇది మార్క్ ప్లాన్ లో భాగమని ఆమెకు అర్థమవుతుంది.

Read Also : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

ఇది పక్కా ప్లానింగ్ తోనే జరిగి ఉంటుంది. ఎమ్మాకి వేరొకరితో అఫైర్ కలిగి ఉందని తెలిసి, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా చేసి ఉంటాడు మార్క్. ఇప్పుడు ఎమ్మా హ్యాండ్‌ కఫ్స్‌తో మార్క్ శవంతో ఇంట్లో చిక్కుకుని, భయపడుతూ ఉంటుంది. ఆమె హ్యాండ్‌ కఫ్స్ తెంచడానికి ట్రై చేస్తుంది. కానీ ఏమాత్రం వీలుకాదు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ ఇంటికి దొంగతనానికి వస్తారు. వీళ్లు మార్క్ హైర్ చేసిన కిల్లర్స్ అని ఆమె అనుకుంటుంది.  ఇప్పుడు ఎమ్మా మరింత ప్రమాదంలో చిక్కు కుంటుంది. ఇక స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. ఎమ్మా అక్కడి నుంచి బతికి బయట పడుతుందా ? మార్క్ ప్లాన్ లో బలైపోతుందా ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×