E-Paper
Advertisement

OTT Movie: రిలీజైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి.. చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు!

OTT Movie: రిలీజైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి.. చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు!
Advertisement

OTT Movie: ఒక్కోసారి రావడం లేటవ్వవచ్చేమో కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో మాత్రం అస్సలు తగ్గేదేలే.. అనేలా కొన్ని సినిమాలు నిరూపిస్తూ ఉంటాయి. అలాంటి జాబితాలోకే ఇప్పుడో సినిమా చేరుతోంది. దాదాపు విడుదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చిన చిత్రం ‘తురుమ్ ఖాన్‌లు’ (Thurum Khanlu). స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలంగాణ యాస, భాష నేపథ్యంలో విలేజ్ నేటివీటితో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. థియేటర్‌లో విడుదల తర్వాత ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అనుకున్న ఈ సినిమా, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఆహా ఓటీటీ (Aha OTT)లో టాప్‌లో ట్రెండ్ అవుతుంది.

Also Read- Rakasa Trailer: ఊరుని వణికించే బ్రహ్మరాక్షసుడు.. ‘రాకాస’ ట్రైలర్ ఎలా ఉందంటే?

‘తురుమ్ ఖాన్‌లు’ కథ ఇదే..

Advertisement

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తుపాకుల గూడెం అనే గ్రామంలో శంకర్‌ (నిమ్మల శ్రీరామ్‌) యూత్‌ లీడర్‌‌గా యాక్టివ్‌గా ఉంటుంటాడు. కరోనా సమయంలో మరదలు లలిత (ఐశ్వర్య ఉల్లింగాల)ను పెళ్లి చేసుకోవాలని, అన్ని సిద్ధం చేసుకుంటున్న సమయంలో.. ఊర్లో లాక్‌డౌన్‌ విధిస్తారు. దీంతో పెళ్లి ఆగిపోతుంది. తన పెళ్లి ఆగడానికి కారణం విరాజ్‌ బ్రహ్మ (దేవరాజ్‌ పాలమూర్‌) అని తెలుసుకున్న శంకర్, అతనిపై పగ పెంచుకుంటాడు. మరోవైపు బ్రహ్మకు అన్నీ ఉన్నా.. ఇంకా పెళ్లి కాదు. ఇక లాక్‌డౌన్‌లో ఊరికి వచ్చిన బ్రహ్మ.. భారతి (పులి సీతా)తో ఎఫైర్‌ నడపాలని చూస్తాడు. మరోవైపు శంకర్‌ స్నేహితుడు విష్ణు (అవినాష్‌ చౌదరి) మనస్పర్థల కారణంగా దూరమైన తన ప్రేయసి పద్మను కలిసేందుకు ప్రయత్నిస్తుంటాడు. విష్ణు-పద్మలు విడిపోవడానికి కారణం ఏంటి? శంకర్‌ పెళ్లిని బ్రహ్మ ఎలా, ఎందుకు ఆపాడు? బ్రహ్మ, భారతీల ఎఫైర్‌ ఎక్కడకు దారి తీసింది? శంకర్‌, విష్ణు కలిసి బ్రహ్మను ఏం చేశారు? చివరకు ఈ ముగ్గురి ప్రేమ కథలకు ఎలాంటి ముగింపు పడిందనేదే ఈ సినిమా.

Also Read- V.V.Vinayak: మెగా హీరో పై వి.వి వినాయక్ కామెంట్స్.. హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదు!

పల్లెల్లో ఉండే ఒరిజినల్ కామెడీ

Advertisement

ఎంటర్‌టైన్‌మెంట్‌కి కావాల్సినంత కంటెంట్ ఇందులో ఉంది. మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. యాక్టర్స్ అంతా కొత్తవారు కావడంతో అప్పట్లో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ, ఓటీటీలో మంచి స్పందన వస్తున్నందుకు మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఎన్‌ శివ కల్యాణ్‌ దర్శకత్వానికి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో ఉండే ఒరిజినల్ కామెడీని అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు దర్శకుడు. దేవరాజ్ పాలమూర్ చేసే కామెడీకి నవ్వకుండా ఉండలేరు. ఆయన డైలాగ్ మాడ్యూలేషన్ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంది. అంతా కొత్త వారితో ఇలాంటి సినిమా నిర్మించడం మాములు విషయం కాదు. ఈ విషయంలో నిర్మాత ఎండీ అసిఫ్‌ జానీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, విడుదలైన కొద్ది సమయంలోనే మిలియన్ల వ్యూస్‌తో పాటు, సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకోవడంతో నిర్మాత కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలో మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు.

Also Read- Actress Rasi: ప్రాణం పోయినా ప్రభాస్ సినిమాలో ఆ పాత్ర చేయను…రాశి సంచలన వ్యాఖ్యలు!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×