E-Paper
Advertisement

OTT Movie : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రీసెంట్ గా మోహన్‌లాల్ నటించిన ఒక మూవీ థియేటర్ లను షేక్ చేసి, ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఈ మూవీ మలయాళంలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ లలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

షణ్ముఖం అనే వ్యక్తి టాక్సీ డ్రైవర్ గా జీవితం గడుపుతుంటాడు. ఇతన్ని అందరూ బెంజ్ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు మలయాళం, తమిళ సినిమాల్లో ప్రసిద్ధ స్టంట్ మాస్టర్ గా ఉండేవాడు. అక్కడ తన స్నేహితుడు ఒక సెట్‌లో జరిగిన దుర్ఘటనలో చనిపోతాడు. అందువల్ల బెంజ్ సినిమా పరిశ్రమను వదిలేసి, తన బ్లాక్ అంబాసిడర్ కారుతో టాక్సీ డ్రైవర్‌గా సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ కారుని అతడు ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తుంటాడు. అతను తన భార్య లలిత (శోభన), కొడుకు పవి (తామస్ మాథ్యూ), కూతురు (అమృత వర్షిణి)తో జీవితం సంతోషంగా గడుపుతుంటాడు. అయితే అతని కారు ఒక మెకానిక్ చేతిలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు. అందులో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు చెప్తారు. బెంజ్ తన కారును తిరిగి పొందేందుకు SI బెన్నీ (బిను పప్పు)ని సంప్రదిస్తాడు. అక్కడ ఇద్దరికీ గట్టిగా వాగ్వాదం జరుగుతుంది.

ఇంతలో CI జార్జ్ మాథన్ (ప్రకాష్ వర్మ) జోక్యం చేసుకుంటాడు. అతనికి కారును అప్పజెప్పే క్రమంలో, బెంజ్ ని ఒక రైడ్ కి తీసుకుని పోతాడు జార్జ్ . చాలా దూరం ప్రయాణించాక ఒక అడవి మార్గంలోకి చేరుకుంటారు. అప్పటికే కారు డిక్కీలో ఒక శవం ఉందని తెలుసుకుంటాడు బెంజ్. ఇక కారులో ఉన్న వాళ్ళతో గోడవకు దిగుతాడు బెంజ్. వాళ్ళు ఇతన్ని బెదిరించి శవాన్ని ఒకచోట పూడ్చడానికి తీసుకెళ్తారు. ఆ తరువాత రోజునుంచి బెంజ్ కొడుకు కనిపించకుండా పోతాడు. అప్పుడే బెంజ్ కి అనుమానం వస్తుంది. ఇక అసలు విషయం తెలిసి దుఖంలో మునిగిపోతాడు బెంజ్. తన కారులో ఉన్నది తన కొడుకు శవం అని తెలిసి పగతో రగిలిపోతాడు. చివరికి బెంజ్ కొడుకుని పోలీసులు ఎందుకు చంపారు ? బెంజ్ తన కొడుకు చావుకి ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : రాజకుమారుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్ట్స్ అన్నీ కట్… ఇదెక్కడి సైకోరా బాబూ

 

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తుడారం’ (Thudarum). 2025లో విడుదలైన ఈ సినిమాకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. రేజపుత్ర విజువల్ మీడియా ద్వారా ఎం. రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇది ప్రస్తుతం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×