E-Paper
Advertisement

Thriller Web Series : ఒళ్లు గగుర్పొడిచే నిజాలతో బెంగాలీ థ్రిల్లర్ సిరీస్… రిలీజ్ డేట్ వాయిదా… అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Thriller Web Series : ఒళ్లు గగుర్పొడిచే నిజాలతో బెంగాలీ థ్రిల్లర్ సిరీస్… రిలీజ్ డేట్ వాయిదా… అందుబాటులోకి వచ్చేది అప్పుడే
Advertisement

Thriller Web Series : ఓటీటీలోకి బెంగాలీ హిస్టారికల్ థ్రిల్లర్ సిరీస్ మరి కొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. 1971 నాటి బంగ్లాదేశ్ విభజన సమయంలో, కోల్‌కతా జాజ్ క్లబ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. గూఢచారి వ్యవస్థ, విప్లవ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక దేశం పుట్టుక వెనుక ఉన్న పోరాట గాథ. ఈ సిరీస్ మొదట ఫిబ్రవరి 6న విడుదల కావాల్సి ఉండగా, తరువాత వాయిదా పడింది. ఇప్పుడు మరో రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ బెంగాలీ హిస్టారికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘జాజ్ సిటీ’ (Jazz City). గులాబ్ గ్యాంగ్ ఫేమ్ సౌమిక్ సేన్ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇది 2026 మార్చి 19న Sony LIV ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది బెంగాలీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో షతాఫ్ ఫిగర్, శాంతాను ఘటక్, అమిత్ సాహా, అలెగ్జాండ్రా టేలర్, శ్రేయ భట్టాచార్య, సయందీప్ సేన్, తానికా బసు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జాజ్ సిటీ దేని గురించి?

Advertisement

1971 నాటి కలకత్తా నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. అప్పట్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయం అది. కలకత్తా నగరంలోని ఒక జాజ్ మ్యూజిక్ క్లబ్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. కేవలం సంగీతం కోసం మాత్రమే కాకుండా, ఈ క్లబ్ గూఢచారి కార్యకలాపాలకు, విప్లవకారులకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. క్లబ్‌లో పాడే పాటలు, వాయించే సంగీతం వెనుక దేశభక్తికి సంబంధించిన రహస్య సంకేతాలు దాగి ఉండటం ఈ కథలోని అసలు ట్విస్ట్.

ముఖ్యంగా బంగ్లాదేశ్ నటుడు అరిఫిన్ షువో ఇందులో జిమ్మీ అనే పాత్రలో కనిపిస్తారు. ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, మరోపక్క సంగీతాన్ని ఆయుధంగా చేసుకుని శత్రువుల ఎత్తుగడలను ఎలా చిత్తు చేశారు అనేదే ప్రధాన కథాంశం. దేశం కోసం ప్రాణాలకు తెగించే గూఢచారులు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోయే ఎమోషన్స్ కూడా ఈ సిరీస్‌లో చాలా ఉత్కంఠభరితంగా చూపించారు.

Advertisement

Read Also : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×