E-Paper
Advertisement

Thriller Series OTT : నమ్మిన వాళ్ళను నట్టేట ముంచే హీరోయిన్… కేక పెట్టిస్తున్న కొరియన్ సిరీస్

Thriller Series OTT : నమ్మిన వాళ్ళను నట్టేట ముంచే హీరోయిన్… కేక పెట్టిస్తున్న కొరియన్ సిరీస్
Advertisement

Thriller Series OTT : ఈమధ్య చేతిలో ఫోన్ లేకపోయినా పర్లేదు కానీ, కొరియన్ సిరీస్ లను చూడకుండా కొంతమంది ఉండలేకపోతున్నారు. అలా అలవాటు పడిపోయాడు ఈ సిరీస్ లకి. ఇక రొమాంటిక్ సిరీస్ లను అయితే కల్లార్పకుండా చూస్తున్నారు. అంతేకాకుండా వాటిలో వచ్చే డ్రెస్సింగ్ స్టైల్స్ ను కూడా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొరియాలో సూపర్ హిట్ అయిన ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. ఒక ప్రముఖ హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్ ఇది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డియర్ ఎక్స్’ (Dear X). 2025లో వచ్చిన ఈ హిట్ సిరీస్‌ను లీ యుంగ్-బోక్ డైరెక్ట్ చేశారు. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, కొరియాలో బిగ్గెస్ట్ హిట్స్ అయిన ‘డిసెండెంట్స్ ఆఫ్ ద సన్’, ‘గాబ్లిన్’, ‘మిస్టర్ సన్షైన్’ వంటి సిరీస్‌లను తీసిన లెజెండరీ డైరెక్టర్. అందుకే దీని మేకింగ్ రేంజ్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఇందులో కిమ్ యూ-జుంగ్, బేక్ అహ్-జిన్ పాత్రలో నటించింది. కిమ్ యంగ్-డే ఆమెకు అండగా నిలిచే వ్యక్తిగా నటించాడు. మొత్తం 12 ఎపిసోడ్లతో ఈ సిరీస్ Viki ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ‘అహ్-జిన్’ అనే ఒక రేంజ్ ఉన్న హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఈమె బయటికి చాలా మర్యాదగా, అందంగా, అందరినీ ఆదుకునే దేవతలా కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈమె ఒక పక్కా సైకో. తన ఎదుగుదల కోసం ఎవరినైనా వాడుకుంటుంది. అడ్డు వస్తే ఎంతటి వారినైనా తొక్కేస్తుంది. చిన్నప్పుడు పడ్డ కష్టాల వల్ల ఆమె మనసు ఇలా రాయిలా మారిపోతుంది. ఆమెకు ‘యూన్ జున్-సో’ అనే ఒక అనుచరుడు ఉంటాడు. అతను ఈమెను పిచ్చిగా నమ్ముతాడు, ప్రాణం కూడా ఇస్తాడు. వాడు ఉన్నదే ఈమె కోసం అన్నట్టు బతుకుతుంటాడు.

అయితే అహ్-జిన్ తన రీవెంజ్ తీర్చుకోవడానికి, పెద్ద సెలబ్రిటీ అవ్వడానికి వాడిని ఒక పావులా వాడుకుంటుంది. అతను కూడా ఆమె కోసం ఏ తప్పు చేయడానికైనా వెనకాడడు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఈ వింతైన, డేంజర్ రిలేషనే ఈ సిరీస్‌లో మెయిన్ హైలైట్. అహ్-జిన్ ఎదిగే కొద్దీ ఆమె చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. తనను నమ్మిన వాళ్ళనే ఆమె ఎలా మోసం చేసింది, తన గోల్‌ కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంది అనేది బయటికి వస్తుంది. చివరకు ఆ గ్లామర్ ప్రపంచం నుండి ఆమె ఎలా కిందపడింది ? ఆమెను ప్రాణంగా ప్రేమించిన వాడు చివరకు ఏం చేశాడు ? అనేదే ఈ థ్రిల్లింగ్ స్టోరీ.

Advertisement

Read Also :  పెళ్లి వేడుకల్లో పిశాచాల గోల… ఆరు ఎపిసోడ్స్ తో ఊహించని ఉత్కంఠ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×