E-Paper
Advertisement

సైకో చేతిలో చిక్కుకొనే చిన్నది… ప్రతీ క్షణం ఉత్కంఠ రేపుతున్న సినిమా

సైకో చేతిలో చిక్కుకొనే చిన్నది… ప్రతీ క్షణం ఉత్కంఠ రేపుతున్న సినిమా
Advertisement

Thriller Movie OTT : ఒక డిఫెరెంట్ స్టోరీతో సీట్ ఎడ్జ్ థ్రిల్ చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయచ్చు. దీనికి ఐయండిబిలో 7.1 రేటింగ్ కూడా ఉంది. ప్రేమించిన అమ్మాయినే ప్రియుడు ఇందులో దారుణంగా టార్చర్ చేస్తుంటాడు. మామూలుగా అయితే కాదు, కంటికి కనబడకుండా. అతని దగ్గర ఒక సూట్ ఉంటుంది. అది వేసుకుంటే మనిషి ఎవరి కంటికి కనబడరు. ఈ ఎఫ్ఫెక్ట్ తో స్టోరీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హర్రర్ మూవీ పేరు ‘ది ఇన్విజిబుల్ మ్యాన్’ (The Invisible Man). ఈ సినిమా కేవలం $7 మిలియన్ల (సుమారు ₹50 కోట్లు) చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా $145 మిలియన్ల (సుమారు ₹1200 కోట్లు) భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. దర్శకుడు లీ వానెల్ తన మేకింగ్ తో ప్రేక్షకుల్లో భయాన్ని బాగానే కలిగించారు. ముఖ్యంగా హీరోయిన్ ఎలిసబెత్ మోస్ తన అద్భుతమైన నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆమె నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సిసిలియా అనే అమ్మాయి తన ప్రియుడు అడ్రియన్ పెట్టే చిత్రహింసలు భరించలేక, ఒక రాత్రి అతడి నుండి తప్పించుకుని పారిపోతుంది. అడ్రియన్ చాలా తెలివైన ఒక పెద్ద సైంటిస్ట్. కొన్నాళ్ల తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వస్తుంది, కానీ సిసిలియా అది అబద్ధమని, వాడు తనను వదలకుండా అంత తేలికగా చావడని అనుమానిస్తుంది. ఆమె ఊహించినట్టే, అడ్రియన్ చావలేదు. తను కనిపెట్టిన ఒక ప్రత్యేకమైన అదృశ్యమయ్యే సూట్ ధరించి, కంటికి కనిపించకుండా ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. ఆమెను మానసికంగా దెబ్బతీస్తూ, ఆమెకు పిచ్చి పట్టిందని అందరూ నమ్మేలా చేస్తాడు. చివరకు తన స్నేహితులను కూడా చంపి, ఆ నింద సిసిలియా మీద పడేలా ప్లాన్ చేస్తాడు. ఎవరూ నమ్మకపోయినా, సిసిలియా ధైర్యంగా అడ్రియన్ తో పోరాడుతుంది. మరి ఈ పోరాటంలో ఎవరిది పై చేయి అవుతుంది ? అడ్రియన్ పెట్టే బాధలనుంచి సిసిలియా బయట పడుతుందా ? ఆ నరకంలోనే మగ్గుతుందా ? ఈ కథ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : రైలు పట్టాలపై పసివాడి ప్రయాణం… ప్రపంచం మొత్తాన్ని ఏడిపించిన ఒక మాస్టర్ పీస్… ఐయండిబిలో 8 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×