// //
Thriller movie OTT : ఇంట్రెస్టింగ్‌గా సాగే స్టోరీని చూడాలనుకునంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా, తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి పడే తాపత్రయంతో నడుస్తుంది. పెళ్ళికి ముందు ఒక అపరిచిత అమ్మాయితో హోటల్ గదిలో గడిపిన తర్వాత అతని జీవితం తలక్రిందులైతుంది. ఆ క్రమంలో ఎదుర్కొనే మెంటల్ టెన్షన్ ను హీరో జిమ్ కమ్మింగ్స్ అద్భుతంగా ప్రదర్శించారు. అతని నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి.
ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది బీటా టెస్ట్’ (The Beta Test). దీనిని జిమ్ కమ్మింగ్స్, పిజె మెక్‌కేబ్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో జిమ్ కమ్మింగ్స్, మెక్‌కేబ్, జెస్సీ బార్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం 2021 మార్చి 1న బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2021 నవంబర్ 5న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.
ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, నేటి డిజిటల్ కాలానికి తగ్గట్టుగా ఉంటుంది. జోర్డాన్ అనే ఒక హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్‌కు తన పెళ్లికి కొన్ని రోజుల ముందు ఒక సీక్రెట్ లెటర్ వస్తుంది. అందులో నీకు నచ్చిన ఒక అందమైన అమ్మాయితో ఎవరికీ తెలియకుండా ఒక హోటల్ గదిలో గడపొచ్చు అని రాసి ఉంటుంది. ఆ కక్కుర్తికి లోనైన జోర్డాన్, తన వివరాలు పంపి ఆ అపరిచిత మహిళను కలుస్తాడు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. ఆ మహిళ ఎవరు? అసలు ఆ లెటర్ పంపింది ఎవరు? అని జోర్డాన్ ఆరా తీయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను తన పెళ్లి పనులను, ఆఫీసు పనులను కూడా పట్టించుకోకుండా ఆ లెటర్ల వెనుక ఉన్న సీక్రెట్ ఛేదించే పనిలో పడతాడు. తను వెళ్లే కొద్దీ, తనలాగే వందల మందికి ఇలాంటి లెటర్లు వెళ్లాయని, కొందరు దీనివల్ల హత్యలు కూడా చేసుకున్నారని తెలుస్తుంది.
అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఇది కేవలం ఒక అక్రమ సంబంధం విషయం మాత్రమే కాదని, దీని వెనుక ఒక పెద్ద ‘డేటా మైనింగ్’ కుట్ర ఉందని అర్థమవుతుంది. మనుషుల బలహీనతలను వాడుకుని, ఇంటర్నెట్ డేటా ద్వారా వాళ్లను ఎలా ట్రాప్ చేస్తున్నారో ఈ సినిమా చూపిస్తుంది. చివరకు అతను ఆ నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఆఫీసును కనిపెడతాడా ? ఆ లెటర్ ఎవరు పంపారు? అతని పర్సనల్ వివరాలు వాళ్లకు ఎలా తెలిశాయి? అతనికి కాబోయే భార్యకి ఈ విషయం తెలుస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : భార్య ఒకరితో భర్త మరొకరితో… సోషల్ మీడియాలో కొత్త ప్రేమ… క్లైమాక్స్ వరకు నవ్వులే