E-Paper
Advertisement

Thriller Movie OTT : మొగుడు మిస్సింగ్ తో భార్య చేసే సాహసం… అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు…క్లైమాక్స్ కేక

Thriller Movie OTT : మొగుడు మిస్సింగ్ తో భార్య చేసే సాహసం… అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు…క్లైమాక్స్ కేక
Advertisement

Thriller Movie OTT  : ఓటీటీలోకి రకరకాల భాషలలో సినిమాలు వస్తున్నాయి. అయితే కంటెంట్ బాగుంటే ఆడియన్స్ భాషను కూడా పట్టించుకోరు. అలాగే వాచ్ చేస్తారు. అలాంటి కంటెంట్ ఉన్న ఒక సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది ఒక మరాఠీ సినిమా. అడవిలోని గిరిజనుల సమస్యలపై డాక్యుమెంటరీ తీస్తూ మిస్సింగ్ అయిన వ్యక్తి కోసం, అతని భార్య, కూతురు వెతికే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇది వురాణాలలోని ఒక రాక్షసుడి కథ ఆధారంగా ఉంటుంది. ఫాంటసీ, మిస్టరీ, అడ్వెంచర్ మిక్స్‌తో ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ మరాఠీ సినిమా. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ మరాఠీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా పేరు ‘రాక్షస్’ (Raakshas). ఈ చిత్రానికి జ్ఞానేష్ జోటింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2018 ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. ప్రధాన పాత్రల్లో సాయి తమ్‌హంకర్ మరియు శరద్ కేల్కర్ నటించారు. వీరితో పాటు రుజుతా దేశ్‌పాండే కీలక పాత్ర పోషించింది. IMDb 7.1/10 రేటింగ్ ని కూడా పొందింది. ప్రస్తుతం Zee5 ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది ఫ్యామిలీతో చూడడానికి బాగా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అవినాష్ ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్. అడవిలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి షూట్ చేస్తూ సడన్‌గా మిస్ అయిపోతాడు. అతడి కోసం భార్య ఐరావతి, కూతురు అరు అడవికి వెళ్తారు. ఐరావతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతుకుతుంటే, చిన్నారి అరు మాత్రం తన దగ్గర ఉన్న ఒక కథల పుస్తకం ఆధారంగా తండ్రిని వెతకడం మొదలుపెడుతుంది. ఆ పుస్తకంలో ఉన్న ఒక రాక్షసుడి కథ నిజంగానే తన తండ్రికి జరిగిందని ఆ పాప నమ్ముతుంది.

అడవిలో ఉండే గిరిజన తెగల నమ్మకాలు, ఆ మాయా కథల పుస్తకం చుట్టూ సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా తిరుగుతుంది. అసలు ఆ అడవిలో ఉన్న రాక్షసుడు ఎవరు? అవినాష్ ఏమయ్యాడు? ఆ మాయా పుస్తకం కథ ఏమిటి ? అనే విషయాలను దర్శకుడు చాలా థ్రిల్లింగ్‌గా చూపించారు. రియాలిటీకి, ఫాంటసీకి మధ్య ఉండే ఈ గ్యాప్‌ని బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ సినిమా, చివరికి ఒక మంచి మెసేజ్‌తో ముగుస్తుంది.

Advertisement

Read Also :  జోంబీగా మారే అందమైన అమ్మాయి… ప్రేమ అంటూ వెంటపడే అబ్బాయి… గుండెకు హత్తుకునే లవ్ స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×