E-Paper
Advertisement

Thriller movie OTT : సైకో కిల్లర్ వేటలో మరో సైకో… సీను సీనుకి ఉత్కంఠ… గ్రిప్పింగ్ స్టోరీ

Thriller movie OTT : సైకో కిల్లర్ వేటలో మరో సైకో… సీను సీనుకి ఉత్కంఠ… గ్రిప్పింగ్ స్టోరీ
Advertisement

Thriller movie OTT : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో ఒక హాలీవుడ్ మూవీ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఏకంగా ఐదు ఆస్కార్ లను గెలిచి ఔరా అనిపించింది. కంటెంట్ కూడా అదే లెవెల్ లో ఉంటుంది మరి. ఒక సైకో కిల్లర్ ని పట్టుకునేందుకు, పోలీసులు జైల్లో ఉన్న మరో సైకో హెల్ప్ తీసుకుంటారు. ఇక సినిమా ఆ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనే క్రమంలో నడుస్తుంది. ఒక్క సారి చూస్తే మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చే స్టోరీ ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో చూడచ్చు అంటే

‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంప్స్’ ఒక అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం ఆస్కార్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించింది. ఇది ‘బిగ్ ఫైవ్’ ఆస్కార్ అవార్డులను (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) గెలుచుకున్న మూడవ చిత్రంగా నిలిచింది. దీనికి జోనాథన్ డెమ్మే దర్శకత్వం వహించారు. ఆంథోనీ హాప్కిన్స్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మాత్రం బాగా భయపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకి ఐయండిబిలో 8.6 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లారిస్ స్టార్లింగ్ అనే ఒక మహిళా ఎఫ్‌బిఐ ‘బఫెలో బిల్’ అనే భయంకరమైన సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే మిషన్‌లో ఉంటుంది. ఆ కిల్లర్ ఆడపిల్లలను చంపి వాళ్ల చర్మాన్ని వలుస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి క్లారిస్, జైల్లో ఉన్న డాక్టర్ హన్నిబాల్ లెక్టార్ అనే మరో డేంజరస్ క్రిమినల్ సహాయం కోరుతుంది. లెక్టార్ చాలా తెలివైన సైకియాట్రిస్ట్. కానీ మనుషులను చంపి తినే అలవాటు ఉన్న రాక్షసుడు కూడా. అతను క్లారిస్‌కి క్లూస్ ఇవ్వాలంటే, ఆమె తన గతాన్ని అతనికి నిజాయితీగా చెప్పాలనే కండిషన్ పెడతాడు.

అలా క్లారిస్ తన మనసులోని బాధలను చెప్తూ, లెక్టార్ ఇచ్చే చిక్కుముడులను విప్పుతూ హంతకుడి వేట కొనసాగిస్తుంది. లెక్టార్ కూడా తన తెలివితేటలతో క్లారిస్ కు క్లూస్ ఇస్తూ బిల్ ఎక్కడున్నాడో కనిపెట్టేలా చేస్తాడు. చివరికి లెక్టార్ జైలు నుండి చాకచక్యంగా తప్పించుకోగా, క్లారిస్ ఒంటరిగా పోరాడి ఆ సీరియల్ కిల్లర్‌ను చంపి ఒక అమ్మాయిని కాపాడుతుంది.

Advertisement

Read Also : ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్… నవ్య నాయర్-సౌబిన్ షాహిర్ కాప్ థ్రిల్లర్… ఎక్కడ చూడవచ్చు అంటే?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×