// // Thriller movie OTT : ఉద్యోగం కోసం మర్డర్ ప్లాన్... ఒక్కొక్కరిని ఒక్కో -->
E-Paper
Advertisement

Thriller movie OTT : ఉద్యోగం కోసం మర్డర్ ప్లాన్… ఒక్కొక్కరిని ఒక్కో విధంగా… కిరాక్ ట్విస్టులు

Thriller movie OTT : ఉద్యోగం కోసం మర్డర్ ప్లాన్… ఒక్కొక్కరిని ఒక్కో విధంగా… కిరాక్ ట్విస్టులు
Advertisement

Thriller movie OTT : కొరియన్ సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ఆడియన్స్. ఓటీటీలో చూసేందుకు మరింత ఇష్టపడుతున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక థ్రిల్లర్ సినిమా ఓటీటీలో మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా ఉంది. మనిషి తన ఉనికి కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడనే పాయింట్‌ను, ఈ సినిమా నవ్వుతెప్పిస్తూనే, భయం పుట్టించేలా చూపిస్తుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, ఉద్యోగం సంపాదించడానికి ఇందులో సీరియల్ కిల్లర్ గా మారుతాడు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా పేరు ‘నో అదర్ ఛాయిస్’ (No Other Choice). ఇది ప్రముఖ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్-వుక్ దర్శకత్వంలో డొనాల్డ్ ఇ. వెస్ట్‌లేక్ రాసిన ‘ది ఆక్స్’ అనే నవల ఆధారంగా రూపొందింది. ఇందులో లీ బైంగ్-హున్, సన్ యే-జిన్, పార్క్ హీ-సూన్ తదితరులు నటించారు. ఈ సినిమా కొరియాలో 2025 సెప్టెంబర్ 24న విడుదలైంది. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డు’ గెలుచుకుంది. అలాగే 98వ ఆస్కార్ అవార్డులకు దక్షిణ కొరియా తరపున అధికారికంగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మాన్-సూ ఒక పేపర్ కంపెనీలో 25 ఏళ్లుగా మేనేజర్‌గా చేస్తూ లైఫ్‌లో బాగా సెటిల్ అవుతాడు. కానీ ఒక్కసారిగా కంపెనీ అతన్ని తీసేయడంతో కష్టాలు మొదలవుతాయి. ఏడాది పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేరే ఉద్యోగం మాత్రం దొరకదు. ఉన్న ఇల్లు, ఫ్యామిలీలో గౌరవం పోతాయేమో అన్న భయంలో అతను ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటాడు. తాను చేరాలనుకున్న కంపెనీలో ఆ ఉద్యోగం కోసం ఎవరెవరైతే పోటీ పడుతున్నారో, ఆ అభ్యర్థులందరినీ చంపేస్తే తనకి అడ్డుండదని మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అందుకోసం అతను ఇప్పుడు ఒక సీరియల్ కిల్లర్ లా మారుతాడు.

ఉద్యోగం కోసం పోటీలో ఉన్న ఒక్కో వ్యక్తిని మాయమాటలతో పిలిపించి చాలా తెలివిగా అంతం చేస్తూ వెళ్తాడు. ఈ క్రమంలో జరిగే హత్యలు, అతను పడే టెన్షన్ సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా మారుస్తాయి. చివరికి అతను అనుకున్నట్టే ఉద్యోగం సాధిస్తాడా ? ఫ్యామిలీలో గౌరవం దక్కుతుందా ? తను చేసిన నేరాలు బయట పడతాయా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దివ్య దత్తా సోషల్ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×