E-Paper
Advertisement

Thriller movie on OTT: కొడుకు ప్రియురాలిపై కన్నేసే తండ్రి… మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

Thriller movie on OTT: కొడుకు ప్రియురాలిపై కన్నేసే తండ్రి… మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
Advertisement

Thriller movie on OTT : ఆండ్రియా జెర్మియా ద్విపాత్రాభినయం చేసిన ఒక సినిమా, అనేక కారణాల వల్ల ఆలస్యమై నేరుగా సన్ టివిలో విడుదలైంది. పోలీస్ ఆఫీసర్‌గా, గత కాలపు యువరాణిగా ఆమె ఇందులో నటించారు. అతీంద్రియ శక్తుల చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఆండ్రియా ఎటువంటి డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లలో బాగా కష్టపడ్డారు. అయితే సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో వచ్చిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మాళికై’ (Maaligai). దిల్ సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటించగా, ఆశీతోష్ రాణా, అశు రెడ్డి, అలీ, కార్తీక్ జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ Zee5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఆకాశం నుంచి దిగివచ్చే మనుషులు… ప్రపంచం అల్లకల్లోలం… గ్రిప్పింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

శాంతి (ఆండ్రియా జెర్మియా) అనే ఏసీపీ అధికారిణి, కాంచీపురంలోని ఒక పురాతన రాజభవనంలో జరుగుతున్న వరుస మరణాల కేసును ఛేదించడానికి అక్కడికి వెళ్తుంది. ఆ బంగ్లాలోకి ప్రవేశించిన తర్వాత, శాంతికి తన గత జన్మకు సంబంధించిన విజన్స్ కనిపిస్తాయి. సుమారు 300 ఏళ్ల క్రితం అదే రాజభవనంలో ఆమె ఒక యువరాణిగా ఉండేదని తెలుసుకుంటుంది. ఆండ్రియా ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ప్రస్తుత కాలంలో పోలీస్ ఆఫీసర్ శాంతిగా, మరొకటి గత కాలంలో యువరాణిగా. ఇప్పుడు స్టోరీ గతానికి వెళ్తుంది.

Advertisement

ఆకాలంలో ఉన్న ఈ రాజభవనంలో, ఎప్పుడూ యవ్వనంగా జీవించాలని కోరుకునే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కొడుకు, యువరాణి ప్రేమలో ఉంటారు. అయితే కొడుకు ప్రియురాలితో గడిపితే 300 ఏళ్ల పాటు యవ్వనంతో ఉండచ్చని ఒక మాంత్రికుడు రాజుకు చెప్పడంతో ఆమె వెంట పడతాడు రాజు. ఈ ప్రయత్నంలో ప్రేమ జంట ప్రాణాలు కోల్పోతారు. ఇక స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పుడు ఆ రాజు ఆమె కోసం దుష్ట శక్తి రూపంలో మళ్ళీ వస్తాడు. తన గత జన్మలో ఆ మాంత్రికుడు చేసిన అన్యాయాన్ని శాంతి తెలుసుకుని, ఆ దుష్టశక్తిని ఎలా అంతం చేసి బంగ్లాలో మిస్టరీని ఛేదించింది అన్నదే సినిమా క్లైమాక్స్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×