E-Paper
Advertisement

Thriller movie OTT: కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ

Thriller movie OTT: కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ
Advertisement

Thriller movie OTT : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఎదుర్కోనే సమస్య సైబర్ భద్రత. టెక్నాలజీ వల్ల లాభాలే కాదు, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా. రజిషా విజయన్ తన నటనతో సినిమాను నడిపించారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా ఇందులో చక్కగా చూపించారు. ఈ మలయాళం సినిమాకి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కాలంలో అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీ ఏమిటంటే

రాహుల్ రిజి నాయర్ దర్శకత్వంలో 2022లో విడుదలైన ఈ మలయాళ టెక్నో-థ్రిల్లర్ సినిమా పేరు ‘కీడం’ (Keedam). ఇందులో రజిషా విజయన్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్ పట్టాంబి మిగతా పాత్రల్లో నటించారు. ఈ డిజిటల్ యుగంలో జరిగే నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా 2022 మే 20న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం Zee 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 6.3/10 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

Read Also : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

కథలోకి వెళ్తే

రాధిక బాలన్ (రజిషా విజయన్) ఒక ఎథికల్ హ్యాకర్. ఆమెకు సైబర్ సెక్యూరిటీలో మంచి పట్టు ఉంది. ఆమె తన తండ్రి బాలన్ (శ్రీనివాసన్) అనే రిటైర్డ్ లాయర్‌తో కలిసి జీవిస్తుంటుంది. ఒకానొక సందర్భంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు రాధికను లక్ష్యంగా చేసుకుని ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వేధించడం మొదలుపెడతారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, రాధిక తన ఎథికల్ హ్యాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ నేరగాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఇక ధైర్యంగా అడుగేసి పని మొదలు పెడుతుంది. ఇందులో ఆమెకు తండ్రి కూడా సపోర్ట్ గా నిలుస్తాడు. మరి ఆమె సైబర్ నేరగాళ్లకు రాధిక ఎలా బుద్ధి చెప్పింది ? వాళ్ళు ఆమెను ఎలా ఇబ్బంది పెట్టారు ? ఈ కథ ఆడియన్స్ కి ఎలాంటి సందేశం ఇస్తుంది ? అనే విషయాలను, ఈ మలయాళ టెక్నో-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఇక సినిమా కూడా మొదటి నుంచి చివరివరకు ఆసక్తికరంగా నడుస్తుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా రజిషా విజయన్, రాధిక బాలన్ పాత్రలో తన నటనతో కట్టిపడేసింది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×