E-Paper
Advertisement

Thriller Movie OTT : సైకో ఉచ్చుకు చిక్కే చిన్నది… డేటింగ్ రాత్రి దిమాక్ ఖరాబ్… సీట్ ఎడ్జ్ పక్కా

Thriller Movie OTT : సైకో ఉచ్చుకు చిక్కే చిన్నది… డేటింగ్ రాత్రి దిమాక్ ఖరాబ్… సీట్ ఎడ్జ్  పక్కా
Advertisement

Thriller Movie OTT : హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల మూడ్ ని మార్చేస్తాయి. ఈ సినిమాలలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కథలు బోలెడు ఉన్నాయి ఓటీటీలో. ఇక థియేటర్ల నుంచి వస్తూనే ఉన్నాయి కూడా. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథలో వయోలెట్ అనే మాహిళ భర్త పోయాకా, మరో వ్యక్తితో డేటింగ్‌కు వెళ్తుంది. ఆ తరువాత ఆమె ఒక సైకో ట్రాప్ లో ఇరుక్కుపోతుంది. ఆ తరువాత ఆడియన్స్ కు అసలు థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ సినిమా కేవలం 1 గంట 32 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే స్టోరీ మాత్రం క్రాక్ ఎక్కిస్తుంది.

పీకాక్ (Peacock) ఓటీటీలో స్ట్రీమింగ్

2025లో వచ్చిన ఈ హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా పేరు’డ్రాప్’ (Drop). ఈ సినిమాను క్రిస్టోఫర్ లాండన్ డైరెక్ట్ చేశారు. ఈయన అంతకుముందు ‘హ్యాపీ డెత్ డే’ (Happy Death Day), ‘ఫ్రీకీ’ (Freaky) వంటి సూపర్ హిట్ హారర్ సినిమాలను తీశారు. అందుకే ఈ సినిమాలో కూడా టెన్షన్‌తో పాటు కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంతేకాదు హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బ్లమ్ హౌస్ ఈ సినిమాను నిర్మించింది. అందుకే సినిమా మేకింగ్ క్వాలిటీ చాలా రిచ్‌గా ఉంటుంది. ఇందులో మెగాన్ ఫాహి (వయోలెట్ పాత్రలో), బ్రాండన్ స్క్లెనార్ (హెన్రీ పాత్రలో) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 11 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది పీకాక్ (Peacock) జియో హాట్ స్టార్ (Jio hotstar) ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వయోలెట్ అనే ఒక మహిళ, తన మొగుడు చనిపోయిన చాలా కాలం తర్వాత, కాస్త రిలాక్స్ అవుదామని అనుకుంటుంది. ఈ క్రమంలో హెన్రీ అనే ఒక కుర్రాడితో కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్తుంది. హోటల్‌లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న టైమ్‌లో, సడన్‌గా ఆమె ఫోన్‌కి ఎవడో అపరిచితుడు ఫోన్ మెసేజ్‌లు పంపడం మొదలుపెడతాడు. వట్టి మెసేజ్‌లు కాదు.. ఆమె ఇంట్లో ఉన్న తన కొడుకును, చెల్లిని గన్ పెట్టి చూపిస్తూ ఫోటోలు పంపుతాడు. దాంతో ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంది.

ఆ మెసేజ్‌లు పంపే సైకో వయోలెట్‌కి ఒకటే కండిషన్ పెడతాడు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే, నీ ముందు కూర్చున్న ఆ హెన్రీని ఇప్పుడే చంపేయ్ అని ఆర్డర్ వేస్తాడు. లేదంటే ఇంట్లో ఉన్నవాళ్లని లేపేస్తానని బెదిరిస్తాడు. తన కళ్ల ముందు కనిపిస్తున్న హెన్రీ మంచివాడా లేక ఆ సైకో గాడితో చేతులు కలిపిన వాడా అని తేల్చుకోలేక, ఒక పక్క కొడుకు ప్రాణం.. ఇంకో పక్క కళ్ల ముందున్న మనిషి.. మధ్యలో వయోలెట్ పిచ్చెక్కిపోతుంది. క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇంతకీ ఆ సైకో గాడు ఎవరు? వయోలెట్ తన కొడుకుని ఎలా కాపాడుకుంది? డేట్‌కి వచ్చిన ఆ కుర్రాడిని నిజంగానే చంపేసిందా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×