E-Paper
Advertisement

The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేసిన ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేసిన ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
Advertisement

The Great Pre Wedding Show OTT: మసూద, పరేషాన్‌ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్‌. నాని టక్‌ జగదీష్‌లో ప్రతికథానాయకుడిగా చేసి తనలోని విలనీజాన్ని పరిచయం చేశాడు. అలా టాలెంటెడ్‌ నటుడిగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మసూదలో అమాయకంగా కనిపిస్తూనే.. ధైర్యంగా దెయ్యంతో పోరాడిన పాత్రతో తిరువీరు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.

కామెడీ లవ్‌స్టోరీగా

అలా సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తూనే మరోపక్క సహానటుడి, విలన్‌ రోల్స్‌ చేస్తున్న తిరువీర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’. కామెడీ, లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. గత నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం మౌత్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. పెద్ద పెద్ద సినిమాలు, అగ్ర హీరోలే చిత్రాలే నిరాశ పరుస్తుండగా.. ఈ చిన్న చిత్రం టాలీవుడ్‌ బాక్సాఫీసుకు డిసెంట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక థియేట్రికల్‌ రన్‌లో సుమారు రూ. 2.5 నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌..

Advertisement

దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ మూవీ హిట్‌తో తిరువీరు పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది. ఇక థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ రోజున (డిసెంబర్‌ 5) నుంచి మూవీ డిజిటిల్‌ ప్రీమియర్‌కు వచ్చేసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ది గ్రేట్‌ ఫ్రీ వెడ్డింగ్‌ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం జీ5(Zee5) మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం థియేటర్లలో మిస్‌ అయిన వారు.. మళ్లీ ఈ కామెడీ లవ్‌ స్టోరీ చూడాలనుకునేవారు ఈ వీకెండ్‌లో ఇంట్లోనే ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో చూసి ఎంజాయ్‌ చేయండి. కాగా ఈ సినిమాతో తిరువీరు సరసన టినా శ్రావ్య హరి హీరోయిన్‌గా నటించగా.. నరేంద్ర రవి, రోహన్ రాయ్‌, యామిని నాగేశ్వర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read: Bigg Boss 9 Telugu Finalist: విన్నింగ్‌ కోసం కంటెస్టెంట్స్ రేస్‌.. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ కళ్యాణ్‌ పడాల!

కథేంటంటే

Advertisement

శ్రీకాకుళం లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం.. రమేష్ (తిరువీర్) ఒక ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. పంచాయతీ సెక్రటరీ హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు. కానీ ఇద్దరూ తమ ప్రేమను బయటపెట్టుకోరు. ఈ క్రమంలో, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) తన పెళ్లి కోసం గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించడానికి రమేష్‌ను సంప్రదిస్తాడు. ఆనంద్-సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ ఎంతో రిచ్‌గా పూర్తి చేస్తాడు. అయితే, దురదృష్టవశాత్తూ, ఆ ఫుటేజ్ ఉన్న చిప్ మిస్ అవుతుంది. చిప్ పోయిన విషయం ఆనంద్‌కు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడ్డ రమేష్, ఆ సమస్య నుంచి బయటపడేందుకు హేమతో కలిసి ఆనంద్ పెళ్లినే చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ, అంతలోనే తన పెళ్లి ఆగిపోయిందని ఆనంద్ వచ్చి రమేష్‌కు ట్విస్ట్ ఇస్తాడు. అసలు ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? చిప్ ఎలా పోయింది? రమేష్-హేమల ప్రేమాయణం ఏమైంది? ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా లేదా? తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×