E-Paper
Advertisement

ఏం సిరీస్ గురూ… కలలోనూ వెంటాడే సీన్లున్న కొరియన్ సిరీస్

ఏం సిరీస్ గురూ… కలలోనూ వెంటాడే సీన్లున్న కొరియన్ సిరీస్
Advertisement

Korean Series OTT : తాజాగా ఓటీటీలోకి వచ్చిన ‘ది వండర్ ఫూల్స్’ అనే క్రేజీ కొరియన్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఇందులో ఒక్క జానర్ కాదు… యాక్షన్, కామెడీ, సూపర్ హీరో, యాక్షన్ వంటి అంశాలన్నీ మిక్స్ అయ్యి ఉన్న సిరీస్ ఇది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ సిరీస్ పేరు ‘The WONDERfools’. ఈ వినూత్నమైన దక్షిణ కొరియా సూపర్ హీరో యాక్షన్-కామెడీ సిరీస్ 2026 మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 1999వ ఏడాది చివరలో ప్రపంచం అంతమైపోతుందనే అపోకలిప్టిక్ (Y2K) భయాల నేపథ్యంలో సాగే కథ ఇది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ లిమిటెడ్ సిరీస్ ప్రస్తుతం Netflix లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ‘Extraordinary Attorney Woo’ చిత్ర దర్శకుడు యూ ఇన్-సిక్ దీనిని ఆసక్తికరంగా తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, భారీ విజువల్స్, హ్యూమర్‌తో సాగే ఈ లైట్-హార్టెడ్ సూపర్ హీరో డ్రామా కొరియన్ మూవీ లవర్స్‌కు మంచి ట్రీట్ లాంటిది అని చెప్పవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

హేసాంగ్ నగరంలో నివసించే యున్ చై-ని (పార్క్ ఉన్-బిన్) మన హీరోయిన్. ఆమె గుండె జబ్బుతో బాధపడుతుంది. ఎప్పుడైనా చనిపోయే స్థితి ఉంటుంది. ఆ అమ్మాయికి చనిపోయేలోపు ప్రపంచాన్ని చూడాలనే ఆశ ఉంటుంది. అందుకోసం తన స్నేహితులు రో-బిన్, క్యుంగ్-హున్‌ లతో కలిసి కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేస్తుంది. కానీ ఆ ప్లాన్ మధ్యలోనే ఆమెకు నిజంగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతుంది. దీంతో ఆమె స్నేహితులు టెన్షన్ పడి, శవాన్ని ఒక పాత చెత్త కుప్ప దగ్గర పడేస్తారు. అయితే అక్కడ లీక్ అవుతున్న ఒక సీక్రెట్ రసాయన వ్యర్థాల (Toxic Waste) వల్ల చై-ని బతికి బయటపడుతుంది. అంతేకాదు ఆ ముగ్గురికీ అద్భుతమైన సూపర్‌ పవర్స్ వస్తాయి.

Also Read : 18 ఎపిసోడ్ల ఖతర్నాక్ క్రైమ్ సిరీస్ భయ్యా… రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్ లో

Advertisement

హీరోయిన్ గుండె వేగం పెరిగినప్పుడల్లా టెలిపోర్ట్ అయ్యే శక్తి ఉంటుంది. అయితే తమ శక్తులను ఎలా వాడాలో తెలియక ఈ ముగ్గురూ ఆందోళన పడుతుంటారు. ఆ సమయంలో సిటీ హాల్‌ లో పని చేసే, గాల్లో వస్తువులను కదిలించగల సీక్రెట్ పవర్స్ ఉన్న లీ ఉన్-జియాంగ్ (చా ఉన్-వూ) వీరికి గురువుగా మారతాడు. ఆయన ద్వారా ఆ శక్తులను అదుపు చేయడం నేర్చుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. డాక్టర్ హా వోన్-డో అనే సైకో సైంటిస్ట్ 20 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ కెమికల్స్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను, శక్తులున్న ఈ ముగ్గురిని అంతం చేయడానికి ప్లాన్ చేస్తాడు. మరి హీరోయిన్ ఆ శక్తులను ఎలా వాడుకుంది ? చివరికి ఏం జరిగింది ? అన్నది కథ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×