E-Paper
Advertisement

OTT Movie : పిల్లల్ని తింటానని బెదిరించే ఘోస్ట్… ఫ్యామిలీని వణికించే ముసుగు దెయ్యం

OTT Movie : పిల్లల్ని తింటానని బెదిరించే ఘోస్ట్… ఫ్యామిలీని వణికించే ముసుగు దెయ్యం
Advertisement

OTT Movie : హారర్ సినిమాలు ఇప్పుడు ప్రతి భాషలో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కంటెంట్ తో వస్తున్న ఇటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అందుకే వీటిని భాషతో ప్రమేయం లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పిల్లల్ని టార్గెట్ చేసే ఒక దెయ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

స్టోరీలోకి వెళితే

Advertisement

రమోనా, డేవిడ్ అనే దంపతులు తన ఇద్దరు పిల్లలు టేలర్, ఆనీ లతో కలసి జీవిస్తుంటారు. డేవిడ్ ఒక కారు ప్రమాదంలో గాయపడి చనిపోతాడు. ఆ తరువాత రమోనా తన ఇద్దరు పిల్లలతో ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తుంది. రమోనా కూడా ఈ ప్రమాదంలో గాయపడి డిప్రెషన్‌ లోకి వెళ్ళిపోతుంది. ఆమె ఒంటరిగా బాధపడుతూ, తన పిల్లలతో కూడా కాస్త దూరంగా ఉంటుంది. ఒక రోజు నల్లటి వస్త్రాలు ధరించిన ఒక మహిళ వారి ఇంటి ముందు యార్డ్‌లో కనిపిస్తుంది. ‘ఇవాళ్టి రోజు’ అని భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఈ మహిళ ఎవరో, ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలియదు. రమోనా తన పిల్లలను ఆమె నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

ఎందుకంటే అది పిల్లల్ని తినేస్తాను అని భయపెడుతుంది. రమోనా దానికి దూరంగా ఉండమని, పిల్లలకి ధైర్యం చెప్తుంది. కానీ టేలర్  ఆమె తల్లి మాటలను వినకుండా ఆ మహిళని ఎదిరించాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రమోనా అతనిపై బాగా కొప్పడుతుంది. రమోనా తన పిల్లలను సురక్షితమైన పొరుగు ఫామ్‌కు పంపి, ఈ వింత ఆకారాన్ని ఎదుర్కొంటుంది. చివరికి రమోనా ఇంట్లో ఉన్న ఆ వింత ఆకారం ఎవరు ? ఆమె భర్త మరణం వెనుక అసలు నిజం ఏమిటి ? రమోనా ఆ వింత ఆకారంతో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వుమన్ ఇన్ ది యార్డ్’ (The Woman in the Yard). 2025 లో విడుదలైన ఈ అమెరికన్ మూవీకి జామ్ కొలెట్-సెర్రా దర్శకత్వం వహించారు. ఇందులో డేనియల్ డెడ్‌వైలర్, ఓక్వుయ్ ఓక్‌పోక్వాసిలి, పేటన్ జాక్సన్, రస్సెల్ హార్న్స్‌బీ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది వుమన్ ఇన్ ది యార్డ్’ 2025 మార్చి 28న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. రమోనా అనే మహిళ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×