E-Paper
Advertisement

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే
Advertisement

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సైకలజికల్ థ్రిల్లర్ ఒక డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ కథలో ఒక జర్నలిస్ట్ లగ్జరీ క్రూజ్ షిప్‌లో ఒక మర్డర్‌ను చూస్తుంది. కానీ ఆమె చెప్పిన విషయాన్ని ఎవరూ నమ్మరు. ఆమె ఆ రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక స్టోరీ ఊహించని ట్విస్టులతో ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

“ది వుమన్ ఇన్ క్యాబిన్ 10” 2025లో విడుదలైన అమెరికన్ సైకలజికల్ థ్రిల్లర్ సినిమా. దీన్ని సైమన్ స్టోన్ డైరెక్ట్ చేశారు. ముఖ్య పాత్రల్లో కిరా నైట్లీ (లో బ్లాక్‌లాక్), గాయ్ పీర్స్ (రిచర్డ్ బుల్మర్), గుగు మ్భాతా-రా (ఆన్) నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఇది 2016లో రూత్ వేర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. IMDb 5.9/10 రేటింగ్ ని కూడా పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

హీరోయిన్ కు ఒక కొత్త అసైన్‌మెంట్ వస్తుంది. ఒక లగ్జరీ క్రూజ్ షిప్ మొదటి ప్రయాణం గురించి రాయడం. ఈ షిప్ యజమాని ఆన్ బుల్మర్ లెక్యూమియాతో బాధపడుతూ ఉంటుంది. ఇక దీని కోసం హీరోయిన్ షిప్‌లోకి వస్తుంది. అక్కడ ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ బెన్ కూడా ఉంటాడు. షిప్‌లో పార్టీలు జరుగుతూ సందడిగా ఉంటుంది. ఒక రాత్రి హీరోయిన్ తన పక్క క్యాబిన్ లో ఒక మహిళను చూస్తుంది. ఆమెను ఎవరో సముద్రంలోకి బలవంతంగా తోసేయడం చూస్తుంది. ఈ సంఘటనతో ఆమె భయాందోళనకు గురవుతుంది. ఈ విషయాన్ని షిప్ సిబ్బందికి చెబుతుంది. కానీ ఆ క్యాబిన్ లో ఎవరూ లేరని, ఆమె చెప్పిన మహిళ గురించి ఎవరికీ తెలియదని చెబుతారు. హీరోయిన్ మాటలను ఎవరూ నమ్మరు.

Read Also : కుళ్లిపోయిన స్థితిలో శవాలు… మాస్క్ వేసుకున్న సైకో అరాచకం… మంచు లక్ష్మి కిర్రాక్ ‘డెడ్లీ కాన్స్పిరసీ’

Advertisement

అయితే ఆమెకు అక్కడ ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది.  దెంతో ఆమె స్వయంగా రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె బెన్ సహాయం తీసుకుంటుంది. కానీ షిప్‌లోని ఇతర ప్రయాణికులు, సిబ్బంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. కథలో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. షిప్ యజమాని ఆన్‌కు లెక్యూమియా లేదని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని తెలుస్తుంది. హీరోయిన్ కి ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థం కాక గందరగోళంలో పడుతుంది. చివరికి అక్కడ చనిపోయిన మహిళ ఎవరు ? ఎందుకు చంపారు ? ఈ కుట్రను హీరోయిన్ ఎలా బయట పెడుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×