E-Paper
Advertisement

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో థియేటర్లలో విడుదలైన ఒక కొరియన్ మూవీ, మొదటి రోజు 3.6 లక్షల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. నాలుగు రోజుల్లో 18 లక్షల వ్యూస్ తో బ్రేక్-ఈవెన్ పాయింట్ చేరుకుని, బాక్స్ ఆఫీస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కొరియన్ థ్రిల్లర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీలో ఒళ్ళు జలదరించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలను చూడాలంటే గుండె కాస్త గట్టిగా కూడా ఉండాలి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

సాంగ్-హూన్ ఒక సామాన్యమైన సాలరీమాన్. తన భార్య సూ-జిన్ కుమార్తెతో కొత్త అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తుంటాడు. ఒక రాత్రి వర్క్‌ప్లేస్ పార్టీ తర్వాత ఇంటికి తాగి వచ్చిన సాంగ్-హూన్, బాల్కనీ నుండి ఒక స్త్రీ ఆర్తనాదం విని అటువైపు చూస్తాడు. టే-హో అనే వ్యక్తి ఆమెను సుత్తితో కొడుతున్న దృశ్యాన్ని చూస్తాడు. సాంగ్-హూన్‌ను టే-హో గమనించి, అతనికి కంటి సైగలతో వార్న్ చేస్తాడు. భయంతో సాంగ్-హూన్ లైట్ ఆఫ్ చేసి, పోలీసులకు చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటాడు. మరుసటి రోజు ఆ స్త్రీ మృతదేహం పోలీసులు గుర్తిస్తారు. డిటెక్టివ్ జే-యోబ్ ఈ కేసును విచారిస్తాడు. సాంగ్-హూన్ భయం వల్ల ఏమీ చెప్పడు. కానీ అపార్ట్‌మెంట్‌లోని ఇతరులు కూడా హత్యను చూసినప్పటికీ నిశ్శబ్దంగా ఉంటారు.

Advertisement

ఈ సమయంలో సాంగ్-హూన్ కుటుంబాన్ని టే-హో టార్గెట్ చేయడం ప్రారంభిస్తాడు. అతను సాక్ష్యం చెప్పకుండా చూడటానికి చంపడానికి ప్రయత్నిస్తాడు. సెకండ్ హాఫ్‌లో టే-హో మరో సాక్షిని హత్య చేస్తాడు. సాంగ్-హూన్ భయం మరింత తీవ్రమవుతుంది. డిటెక్టివ్ జే-యోబ్ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. సాక్షాలు లేకపోవడంతో పోలీసుల పని కష్టంగా మారుతుంది. సాంగ్-హూన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ టే-హో అతని ఇంటికి చేరుకుంటాడు. సాంగ్-హూన్ భార్య సూ-జిన్ ధైర్యంగా టే-హోను ఎదుర్కొంటుంది. ఆ తరువాత సాంగ్-హూన్ అతన్ని ఒక అడవిలోకి ఛేజ్ చేస్తాడు. ఈ ఛేజ్ ఎలా జరుగుతుంది ? కిల్లర్ ఏమవుతాడు ? ఇక ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది విట్‌నెస్’ (The Witness) 2018లో విడుదలైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. జో క్యూ-జాంగ్ దర్శకత్వంలో నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో లీ సంగ్-మిన్ (సాంగ్-హూన్), కిమ్ సాంగ్-హో (డిటెక్టివ్ జే-యోబ్), జిన్ క్యుంగ్ (సూ-జిన్, సాంగ్-హూన్ భార్య), క్వాక్ సి-యాంగ్ (టే-హో, కిల్లర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018ఆగస్టు 15 థియేటర్లలో విడుదలై, 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో,ప్లెక్స్‌లో కొరియన్‌లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది

Advertisement

Read Also : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×