E-Paper
Advertisement

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : హారర్ సినిమాలకు అభిమానులు కూడా ఎక్కువే. దెయ్యాలను సినిమాలలోనే చూసి భయపడుతుంటాం. ఈ దెయ్యాలు ఉన్నాయా ? లేవా ? అనేది ఇప్పటికీ ఒక సమాధానం లేని ప్రశ్నే. ఈ డిజిటల్ యుగం వీటిని కొట్టి పారేస్తున్నా, అక్కడక్కడా జరిగే కొన్ని సంఘటనలు ఆలోచనలో పడేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఓటీటీలో ఆడియన్స్ చేత కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఒక ఆత్మ రివేంజ్ తీర్చుకునే సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

కథలోకి వెళ్తే

వరుణ్, ఆర్య అనే ఒక కొత్తగా పెళ్లైన జంట, ఒక నగరంలో కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారతారు. వీడియో ఎడిటర్ అయిన వరుణ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆర్య సంతోషంగా జీవిస్తుంటారు. కానీ వారి కొత్త ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. ఫోటో ఫ్రేమ్‌లు పడిపోవడం, కిటికీలు ఆటోమాటిగ్గా తెరుచుకోవడం, రాత్రిపూట వింత శబ్దాలు, కప్బోర్డ్‌లో నీడలు కనిపించడం వంటి ఘటనలు ఆర్యను భయపెడతాయి. వరుణ్ మొదట్లో ఈ సంఘటనలను హాలూసినేషన్స్‌గా తోసిపుచ్చినప్పటికీ, ఒక రోజు పనిమనిషి బిడ్డ రన్నింగ్ వాషింగ్ మెషీన్‌లో చిక్కుకోవడంతో అతనూ ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆర్య ఒక సైకిక్/ఎక్సార్సిస్ట్ అయిన డాక్టర్ రైమా దాస్ సహాయం తీసుకుంటుంది. ఈ ఆత్మ వరుణ్ గతంతో ముడిపడి ఉందని తెలుస్తుంది.

Advertisement

ఫ్లాష్‌బ్యాక్‌లో వరుణ్ గతంలో ఒక ఆకల్టిస్ట్ మహిళ కుమార్తె సరికాని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ గ్రామస్తులు ఆ మహిళను మంత్రగత్తెగా భావించి ఊరు నుంచి తరిమేస్తారు. ఆతరువాత సరికా చనిపోయి కనిపిస్తుంది. దీని వెనుక ఒక రహస్యం ఉంది. ఆమెను వరుణ్ సోదరుడు విక్రమ్ చంపినట్లు సూచనలు వస్తాయి. కానీ క్లైమాక్స్‌లో వరుణ్ దీనికి నిజమైన బాధ్యుడని బయటపడుతుంది. ఇప్పుడు సరికా ఆత్మ రివేంజ్ తీర్చుకోవడానికి వరుణ్‌ను వెంటాడుతూ, అతని సోదరుడిని చంపి, ఇప్పుడు వరుణ్, ఆర్యలను బెదిరిస్తుంది. రైమా ఒక బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ ద్వారా ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మ ఇంకా ఇంట్లోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో సరికా ఆత్మ వరుణ్‌ను చంపడానికి తిరిగి వస్తుంది. చివరికి ఈ ఆత్మ వరుణ్‌ను చంపుతుందా ? ఆర్య రిచ్యువల్ ఆత్మని బంధిస్తుందా ? ఈ స్టోరీ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘ది వైఫ్’ (The Wife) 2021లో విడుదలైన హిందీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. సర్మద్ ఖాన్ దర్శకత్వంలో, గుర్మీత్ చౌదరి (వరుణ్), సయానీ దత్తా (ఆర్య), శ్వేతా దధీచ్ (డాక్టర్ రైమా దాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021 మార్చి 19న ZEE5లో విడుదలై, 1 గంట 47 నిమిషాల రన్‌టైమ్‌తో, హిందీ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : అమ్మాయిలనే టార్గెట్ చేసే ఏలియన్… అర్ధరాత్రి బట్టలన్నీ విప్పి అలాంటి పని… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×