E-Paper
Advertisement

OTT Movie : బయట పడుకుంటే తలలు ఛిద్రం… రాళ్లతో కొట్టి చంపే స్టోన్ మ్యాన్… వెన్నులో వణుకు పుట్టించే రియల్ స్టోరీ

OTT Movie : బయట పడుకుంటే తలలు ఛిద్రం… రాళ్లతో కొట్టి చంపే స్టోన్ మ్యాన్… వెన్నులో వణుకు పుట్టించే రియల్ స్టోరీ
Advertisement

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా ఉంటాయి. అయితే అలాంటి సినిమాలలో ఉండే సీన్స్ ను రియల్ లైఫ్ లో ఊహించుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ నిజంగానే ముంబై, కోల్కోత్తాలను గడగడలాడించిన సైకో కిల్లర్ రియల్ స్టోరీ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ రియల్ లైఫ్ రీల్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దాని కథేంటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్
ఈ బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘The Stoneman Murders’. ఇది 1980ల కోల్‌కతాలో ఒక జర్నలిస్ట్ ఒక రహస్యమైన డైరీని కనుగొని, ఆమె స్టోన్‌మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ కిల్లర్ రాత్రిపూట నిద్రిస్తున్న నిరాశ్రయులను కిరాతకంగా హత్య చేస్తాడు. ఈ సిరీస్ క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ డ్రామా 1980లలో కోల్‌కతా, ముంబైలో జరిగిన నిజమైన స్టోన్‌మ్యాన్ హత్యల ఆధారంగా తెరకెక్కింది.

Advertisement

ఈ సిరీస్ లో రజతభ దత్త (స్టోన్‌మ్యాన్), స్వస్తిక ముఖర్జీ (స్నేహ), రూపంకర్ బాగ్చీ, అరిజిత్ దత్త, జిత్ దాస్ తదితరులు నటించారు. ఈ సిరీస్ హోయిచోయ్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. మొత్తం 4 ఎపిసోడ్లు ఉండగా, ప్రతి ఎపిసోడ్‌కు సుమారు 17-18 నిమిషాలు ఉంటుంది.

కథలోకి వెళ్తే…
కథ 1980ల కోల్‌కతాలో జరిగిన నిజమైన స్టోన్‌మ్యాన్ హత్యల ఆధారంగా రూపొందింది. ఒక గుర్తు తెలియని సీరియల్ కిల్లర్ రాత్రిపూట నిరాశ్రయులైన వారిని, ఫుట్ పాత్ పై పడుకునే వారిని భారీ రాయితో కొట్టి హత్య చేస్తాడు. స్నేహ (స్వస్తిక ముఖర్జీ) అనే జర్నలిస్ట్ ట్రైన్ జర్నీతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆమె హరిద్వార్‌కు వెళ్తూ ఒక డైరీని కనిపెడుతుంది. ఇందులో స్టోన్‌మ్యాన్ హత్యల వివరాలు ఉంటాయి. ఈ డైరీ ఆమెలో స్టోన్‌మ్యాన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Advertisement

Read Also : కల్లోకి వెళ్లి కార్పొరేట్ సీక్రెట్స్ దొంగిలించే స్కామర్స్… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

అతను 1985-1989 మధ్య ముంబై, కోల్‌కతాలో 13 మంది నిరాశ్రయులను హత్య చేసిన గుర్తు తెలియని కిల్లర్. స్నేహ, తన స్నేహితురాలు సైనాతో కలిసి, హరిద్వార్‌లో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ వాళ్ళు బాబా జీబానంద అనే వ్యక్తిని కలుస్తారు, అతను అనుమానాస్పదంగా ఉంటాడు. ఇక ఒక సాధువు వారిని రహస్యంగా వెంబడిస్తాడు. స్నేహ డైరీని చదువుతూ, స్టోన్‌మ్యాన్ హత్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తూ, ఈ కేసు ఇన్వెస్టిగేటర్‌లను కలుస్తుంది. ఇంతకీ ఆ హత్యలు చేస్తుంది ఎవరు? ఆ బాబాకు కిల్లర్ కు ఉన్న సంబంధం ఏంటి? చివరికి సిరీస్ కి ఎలా ఎండ్ కార్డు పడింది? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×