E-Paper
Advertisement

యజమాని మర్డర్ మిస్టరీ ఛేదించే గొర్రెలు.. అబ్బురపరిచే వింతైన మిస్టరీ కామెడీ థ్రిలర్ ఇది

యజమాని మర్డర్ మిస్టరీ ఛేదించే గొర్రెలు.. అబ్బురపరిచే వింతైన మిస్టరీ కామెడీ థ్రిలర్ ఇది
Advertisement

Mystery Thriller: ఇన్వెస్టిగేటివ్ క్రైం థ్రిల్లర్ సినిమాలు అనగానే ఊహించని మలుపులతో సాగే దర్యాప్తు కళ్ళ ముందు మెదులుతుంది. తెలివిగల పోలీస్ ఆఫీసర్ ఈ కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తూ, నిమిషానికో ట్విస్ట్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాలో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి అడుగు పెడుతుంది. ఆ సినిమా పేరు ‘ది షిప్ డిటెక్టివ్స్’ (The Sheep Detectives). 2026 లో రిలీజ్ అయిన ఈ సినిమా లియోని స్వాన్ రాసిన ‘త్రీ బ్యాగ్స్ ఫుల్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. మరి ఈ వినూత్నమైన మర్డర్ మిస్టరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇంగ్లాండ్ లోని డెన్ బ్రూక్ అనే పల్లెటూరులో కథ సాగుతుంది. జార్జ్ హార్ది అనే గొర్రెల కాపరి ఉంటాడు. అతనికి తను పెంచుకుంటున్న గొర్రెల మంద ఎంత ఇష్టం అంటే… ప్రతిరోజు రాత్రి వాటికి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ నవలలను కథలుగా చదివి వినిపిస్తూ ఉంటాడు. నిజానికి జార్జ్ వాటికి ఈ కథలు అర్థం కావని ఫీల్ అవుతాడు. కానీ ఆ గొర్రెలు మాత్రం చాలా తెలివైనవి. అందులో లిల్లీ అనే గొర్రె జార్జ్ పుస్తకాన్ని పూర్తి చేయకముందే నేరస్తులు ఎవరో కనిపెట్టేంత తెలివైనది. ఆ గొర్రెల మందలో సెబాస్టియన్, మోపుల్, క్లౌడ్, సర్ రిచ్ ఫీల్డ్ వంటి రకరకాల గొర్రెలు కూడా ఉంటాయి.

Advertisement

ఓ రోజు ఉదయం జార్జ్ దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయి పడుంటాడు. ఆ ఊరి కొత్త పోలీస్ ఆఫీసర్ టిమ్ క్ పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు. దీంతో ఇది గుండెపోటు అని కేసని కొట్టి పారేస్తారు. కానీ గొర్రెలు మాత్రం తమ యజమాని సహజంగా చనిపోలేదని, ఎవరో హత్య చేశారన్న విషయాన్ని గుర్తిస్తాయి. జార్జ్ ఇప్పటిదాకా తనకు చదివి వినిపించిన పుస్తకాలలోని చిట్కాలను ఉపయోగించి, ఈ మర్డర్ మిస్టరీని తామే చేధించాలని లిల్లీ నాయకత్వంలో గొర్రెలు డిటెక్టివ్ గా రంగంలోకి అడుగు పెడతాయి.

ఈ క్రమంలోనే పచ్చటి మైదానాన్ని వదిలి మొదటిసారి మనుషుల ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తాయి గొర్రెలు. జార్జ్ రాసిన వీలునామా గురించి తెలుసుకున్న గొర్రెలు దాని ఆధారంగానే క్లూస్ వెతకడం స్టార్ట్ చేస్తాయి. అందులో భాగంగా జార్జ్ అమెరికన్ కూతురు రెబక్కా, ఊర్లోని కసాయి, కొత్తగా వచ్చిన గొర్రెల కాపరి వంటి వారిపై నిఘా పెడతాయి. ఇన్వెస్టిగేషన్ ఈ రకంగా కొనసాగుతున్న క్రమంలో గొర్రెల మందలోని పెద్ద గొర్రె సెబాస్టియన్ చనిపోతుంది. దీంతో గొర్రెలు తీవ్ర నిరాశకు గురవుతాయి. మనుషులు చాలా క్రూరమైన వాళ్ళని, ఇదే రకంగా ముందుకు వెళితే తాము కూడా చనిపోతామనే భయంతో ఈ మిస్టరీని వదిలేసి మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

లిల్లీ కూడా ఇవన్నీ మర్చిపోవాలి అనుకుంటుంది. అలాంటి టైంలో లిల్లీ కి జార్జ్ ఆత్మ కనిపించి రెబక్కా అమాయకురాలని, అసలైన హంతకుడిని కనిపెడితేనే గొర్రెల మంద సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. ఇలాంటి టైంలో జార్జ్ శవాన్ని చూసినప్పుడు కనిపించిన ఓ ముఖ్యమైన క్లూ లిల్లీ మదిలో మెదులుతుంది. జార్జ్ చేతికి నీలం రంగు, మరో చేతికి ఆకుపచ్చ రంగు మరకలు అంటుకుని ఉంటాయి. మరి ఆకుపచ్చ రంగు వెనుక ఉన్న రహస్యం ఏంటి ? దాన్ని లిల్లీ ఎలా కనిపెట్టింది ? అసలు జార్జ్ ఎలా చనిపోయాడు ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also : ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మహిళలే ఈ కిల్లర్ టార్గెట్… రియల్ లైఫ్ సైకో కిల్లర్ కథ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×