E-Paper
Advertisement

OTT Movie : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు

OTT Movie : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు
Advertisement

OTT Movie : క్రైమ్-థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మంచి మసాలా కిక్ ఇచ్చే ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దేవదాసి పద్ధతులు, ఇద్దరమ్మాయిల లవ్ స్టోరీ, ఒక హత్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ను కూడా దక్కించుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

‘ది షేమ్ లెస్’ (The Shameless) 2024లో హిందీ భాషలో వచ్చిన క్రైమ్-డ్రామా మూవీ. దీనికి బల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించారు. ఇందులో అనసూయ సేన్‌గుప్తా, ఒమారా షెట్టి, ఔరోషిఖ దే, రోహిత్ కొకాటే, మీతా వశిష్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. 115 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ చిత్రం 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అనసూయ సేన్‌గుప్తా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ను కూడా గెలుచుకున్నారు. దీనికి IMDbలో 5.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ముబి, జస్ట్ వాచ్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : సిటీలో మిస్సింగ్ కేసులన్నీ ఈ ‘సేల్స్‌మన్’ కే లింక్… ఓటీటీలోకి వచ్చేసిన మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళితే
Advertisement

ఢిల్లీలోని ఒక వేశ్యాగృహంలో రేణుకా (అనసూయ సేన్‌గుప్తా) అనే ముస్లిం మహిళ, ఒక పోలీస్ అధికారిని చంపి, రాత్రిపూట ఎస్కేప్ అవుతుంది. ఆమె చట్టం నుంచి తప్పించుకోవడానికి, ఉత్తర భారతంలోని ఒక దేవదాసి కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. ఈ ప్రాంతంలో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రేణుకా తన గతాన్ని దాచుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆమె దేవిక (ఒమారా షెట్టి) అనే 17 ఏళ్ల అమ్మాయిని కలుస్తుంది. దేవిక ఒక ప్రముఖ హిందూ కుటుంబానికి చెందినది. కానీ ఆమె కుటుంబం దేవదాసి సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. ఆమె వర్జినిటీని ఎక్కువ ధరకు అమ్మడానికి ఆమె తల్లి ప్లాన్ చేస్తుంది. దేవిక రాపర్ కావాలని కలలు కంటుంది, కానీ ఆమె జీవితం మరోలా వెళ్తుంది.

ఈ క్రమంలో రేణుకా, దేవిక మధ్య ఒక రకమైన ప్రేమ మొదలవుతుంది. ఇది సమాజం, కుటుంబం ఒప్పుకోని ప్రేమ. రేణుకా, దేవిక మధ్య ప్రేమ త్వరగా బ్లాసమ్ అవుతుంది. ఇద్దరూ కలిసి, దేవిక కుటుంబం నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రమాదకర జర్నీ స్టార్ట్ చేస్తారు. రేణుకా, దేవిక తమ స్వేచ్ఛ కోసం ఒక ఫైనల్ పుష్ చేస్తారు. కానీ సినిమా ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. రేణుకా, దేవిక లవ్ ట్రాక్ ఏమవుతుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళు దేవదాసిలుగానే ఉండిపోతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×