// // The Rip ott : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కాప్ థ్రిల్లర్... -->
E-Paper
Advertisement

The Rip ott : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కాప్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు టర్నులు

The Rip ott : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కాప్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు టర్నులు
Advertisement

The Rip ott : రీసెంట్ గా ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇది స్ట్రీమింగ్ అయిన వెంటనే టాప్ 10 లో ట్రెండింగ్ అవుతోంది. సినిమా కథ చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించనిదిగా ఉంటుంది. ఈ సినిమా కథ నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 20 మిలియన్ డాలర్ల నగదు చుట్టూ కథ తిరుగుతుంది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

జో కార్నహన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది రిప్’ (The Rip). ఈ అమెరికన్ కాప్ థ్రిల్లర్ లో మాట్ డామన్, బెన్ అఫ్లెక్, సాషా కాలే, స్కాట్ ఐకిన్స్, టెయానా టేలర్, స్టీవెన్ యూన్, లూసియానా బారోసో నటించారు. 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డబ్బు, అవినీతి, మోసం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2026 జనవరి 16 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : 1 గంట 50 నిమిషాల మెగా ఫ్లాప్… బాబా ముసుగుపై దెబ్బ కొట్టాలని చూసే అమ్మాయి… క్లైమాక్స్ కేక

స్టోరీ ఏమిటంటే

ఈ సినిమా కథ ఒక స్పెషల్ పోలీసు టీం చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ టీమ్ కెప్టెన్ జాకీ వెలెజ్ కథ మొదలయ్యే మొందే హత్యకు గురవుతుంది. ఆమె మరణం వెనుక ఆమె సొంత టీం వాళ్ళే ఉండవచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తుంది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ డేన్ డుమర్స్, అతని ప్రాణస్నేహితుడు జె.డి. బైర్న్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి కెప్టెన్ చనిపోవడానికి ముందు డుమర్స్‌కు ఒక అడ్రస్ పంపిస్తుంది. అక్కడ డ్రగ్ కార్టెల్‌కు చెందిన భారీ మొత్తంలో డబ్బు ఉందని భావించిన డుమర్స్, తన టీమ్ సభ్యులను తీసుకుని ఆ ఇంటిపై రైడ్ చేస్తాడు. అక్కడ వాళ్ళకి ఎవరూ ఊహించని విధంగా సుమారు 20 మిలియన్ డాలర్ల నగదు దొరుకుతుంది.

Advertisement

ఆ భారీ నగదును చూడగానే టీమ్ మధ్య అత్యాశ, అనుమానాలు మొదలవుతాయి. డుమర్స్  తన పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా, టీమ్ సభ్యుల ఫోన్లను లాగేసుకుని డబ్బును లెక్కించమని ఆదేశిస్తాడు. అతని ప్రవర్తన టీమ్‌లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆ ఇంట్లో నివసించే డెసీ అనే యువతి ఈ పోలీసులను దొంగ పోలీసులు గా అనుమానిస్తుంది. బయట నుండి ఒక పక్క కార్టెల్ సభ్యులు దాడులు చేస్తుండగా, టీమ్ లోపల కూడా ఒకరినొకరు చంపుకునే స్థితికి చేరుకుంటారు. ఇక సినిమా చివరలో అసలు ద్రోహి ఎవరనేది బయటపడుతుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×