E-Paper
Advertisement

మనుషులని మాయం చేసే బ్లాక్ మ్యాజిక్… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్లున్న మూవీ

మనుషులని మాయం చేసే బ్లాక్ మ్యాజిక్… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్లున్న మూవీ
Advertisement

Horror Movie on OTT : ఓ ఆడ దెయ్యం 20 ఏళ్ల ప్రతీకారంతో రగిలిపోతే… పగ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చి దాని కళ్ల ముందు మెదిలితే.. ఆ ఊచకోత మామూలుగా ఉండదు. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

అత్యంత భయంకరమైన ఇండోనేషియన్ బాడీ-హారర్ థ్రిల్లర్ చిత్రం The Queen of Black Magic. 2019లో విడుదలైన ఈ మూవీకి ‘ఇంపెటిగోర్’ ఫేమ్ జోకో అన్వర్ స్క్రీన్‌ప్లే అందించారు. ఒక పాత అనాథాశ్రమం వెనుక దాగి ఉన్న క్రూరమైన పాపాలు, చేతబడి, పగ వంటి అంశాల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఈ మైండ్ – బ్లోయింగ్ ఎక్స్‌ట్రీమ్ హారర్ చిత్రం ప్రస్తుతం భారతదేశంలో Amazon Prime Video లో అందుబాటులో ఉంది. గుండె గట్టిగా ఉన్నవారు, బాడీ-హారర్ సినిమాలను ఇష్టపడేవారు చూడాల్సిన పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ ఈ మూవీ. కాబట్టి హారర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Also Read : రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ నుంచి అవుట్… పట్టపగలే చూసినా ప్యాంటు తడవాల్సిందే

Advertisement

కథలోకి వెళ్తే…

హనీఫ్ (అరియో బయూ) అనే వ్యక్తి ఇందులో హీరో. అతను తన భార్య నాదియా, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ అనాథ ఆశ్రమానికి వెళతాడు. అతను చిన్నప్పుడు పెరిగిన ఒక మారుమూల ఆశ్రమం అది. ఆ అనాథాశ్రమాన్ని నడిపిన వృద్ధుడు ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అతడిని చివరిసారిగా చూడటానికి హనీఫ్‌ తో పాటు అతని చిన్ననాటి స్నేహితులు ఆంటో, జెఫ్రీలు కూడా వారి కుటుంబాలతో కలిసి అక్కడికి వెళతారు. పగలు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఆశ్రమం బిల్డింగ్. దీంతో ఫ్రెండ్స్ అంతా పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. కానీ ఆ భవనంలో రాత్రి అయ్యేసరికి వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Also Read : పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

చీకటి పడగానే ఆ భవనంలో ఒక్కొక్కరుగా మాయమవ్వడం జరుగుతుంది. అంతేనా వింత శబ్దాలు కూడా విన్పిస్తాయి. అయితే ఇదంతా అక్కడున్న దెయ్యం మాత్రమే కాదు చేతబడి అని అక్కడున్న వాళ్ళకి మెల్లగా అర్థం అవుతుంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులు తమంతట తామే గాయపరుచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ నిజం బయట పడుతుంది. ఆ బిల్డింగ్ లో పగతో రగిలిపోతున్న దెయ్యం ఎవరు ? అక్కడ చేతబడి ఎందుకు, ఎవరు చేశారు ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ మూవీని పూర్తిగా చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×