E-Paper
Advertisement

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు.. సొంత భార్యనే దారుణంగా … ఒక్కసారి చూస్తే

OTT Movie: మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు..  సొంత భార్యనే దారుణంగా … ఒక్కసారి చూస్తే
Advertisement

OTT Movie : ఒక హై వోల్టేజ్ కోర్ట్‌ రూమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే, ‘ది ప్రాక్యూరేటర్’ అనే సినిమాపై ఓ లుక్ వేయండి. 2023లో వచ్చిన ఈ సినిమా చైనాలో 500 కోట్లకు పైగా వసూలు చేసి, చైనా కోర్ట్‌రూమ్ థ్రిల్లర్స్‌లో టాప్ 5లో నిలిచింది. ఈ స్టోరీ రిచ్ వర్సెస్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద తిరుగుతుంది. ఒక చైనీస్ బిలియనీర్ తన భార్యని చంపి సూసైడ్‌లా క్రియేట్ చేస్తాడు. ఆ తరువాత వచ్చే థ్రిల్లర్ సీన్స్ ని ఒక్కసారి చూస్తే సీట్ ఎడ్జ్ గ్యారంటీ. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ చైనా హై వోల్టేజ్ కోర్ట్‌ రూమ్ థ్రిల్లర్ ‘ది ప్రాక్యూరేటర్’ (The Procurator) 2023 లో థియేటర్స్‌లో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మాక్ టిన్-షూ దర్శకత్వంలో జానీ హువాంగ్ జింగ్యూ, బై బైహె, వాంగ్ క్వియాన్‌యువాన్ లీడ్ రోల్స్ లో నటించారు. 112 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 7.1/10 రేటింగ్ ని కూడా పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చైనాలో బిలియనీర్ జాంగ్ తన భార్య రూయిని లగ్జరీ విల్లా బాల్కనీ నుంచి తోసేసి చంపి, సూసైడ్‌లా కవరప్ చేస్తాడు. పోలీసులు ఈ కేసును సూసైడ్ అని క్లోజ్ చేయబోతుంటే, లాయర్ లీ ఈ కేసును రీఓపెన్ చేసి జాంగ్‌ని మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తాడు. జాంగ్ తన డబ్బు, పవర్, టాప్ లాయర్స్ టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. అతనికి వ్యతరేకంగా ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తాడు. విట్‌నెస్‌లను బెదిరిస్తాడు, హౌస్ మెయిడ్‌ని కారుతో ఢీకొట్టి చంపేస్తాడు. రూయి ఇంటికి బాంబు బెదిరింపు కూడా పంపుతాడు. కోర్ట్‌రూమ్‌లో జాంగ్ లాయర్స్ ఒక్కో ఎవిడెన్స్‌ని నిరాధారమైనవిగా ప్రూవ్ చేస్తారు.

Read Also : ఒక హత్య ట్విస్టులు మాత్రం బోలెడు… సినీ నటుడి కేసులో కిరాక్ ఇన్వెస్టిగేషన్… ఉత్కంఠ రేపుతున్న సిరీస్

ఈ సమయంలో జర్నలిస్ట్ జియా రహస్యంగా జాంగ్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ను హ్యాక్ చేసి లీ కి ఇవ్వాలని వస్తుంటుంది. కానీ చివరి సెషన్‌లో జాంగ్ గ్యాంగ్ జియాని కిడ్నాప్ చేసి వీడియో డిలీట్ చేస్తుంది. కానీ లీ ఒక్కడే వాళ్లతో ఫైట్ చేసి జియాని రక్షించి వీడియోని రికవర్ చేస్తాడు. కోర్టులో ఆ వీడియో ప్లే అవుతుంది. జాంగ్ తన భార్యని బాల్కనీ నుంచి తోసేస్తున్న సీన్ పూర్తిగా కోర్టుకి కనిపిస్తుంది. ఇక జాంగ్ కూడా ఆమె నన్ను వదిలి వెళ్లిపోతుందని భయం చంపేశానని ఒప్పుకుంటాడు. జాంగ్ జైలుకి వెళ్తాడు. లీ జస్టిస్ గెలిచిన హీరోగా నిలుస్తాడు.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×