E-Paper
Advertisement

ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్
Advertisement

Mythology Horror movie: ఇంగ్లీష్ హర్రర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ హాలీవుడ్ నుంచి వచ్చే హారర్ థ్రిల్లర్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ అలాంటి సినిమాలో ఇండియన్ అఘోరా కనిపించి సర్ప్రైజ్ ఇస్తే…. ఆ కిక్కే వేరు కదా. మీకు కూడా ఆ థ్రిల్ కావాలనుకుంటే బ్రిటిష్-అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ చిత్రం ‘ది అదర్ సైడ్ ఆఫ్ ది డోర్’ (The Other Side of the Door)పై ఒక లుక్కేయండి. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? ఆ ఇంగ్లీష్ మూవీలో మన అఘోర ఏం చేస్తున్నాడు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మరియా, మైఖేల్ అనే అమెరికన్ దంపతులు ఉంటారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు ఆలివర్, లూసీ. ఈ ఫ్యామిలీ ముంబైలో సుఖంగా జీవితం గడుపుతుంటారు. ఒకరోజు మరియా తన ఇద్దరు పిల్లలతో కారులో వెళ్తుండగా ఒక నదిలో పడి ఘోర ప్రమాదానికి గురవుతుంది. కారు మునిగిపోతున్న సమయంలో మరియా పిల్లలిద్దరిలో తన కూతురు లూసీని మాత్రమే రక్షించగలుగుతుంది. కొడుకు ఆలివర్ మునిగిపోతాడు. ఈ ఘోర ప్రమాదం తర్వాత మరియా తీవ్రమైన డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తుంది.

Advertisement

తన కొడుకుకు కడసారి వీడ్కోలు చెప్పలేకపోయానే అనే బాధ ఆమెను వేధిస్తుంది. వాళ్ళ ఇంట్లో పని చేసే ఇండియన్ పని మనిషి పికీ. మరియా బాధను చూసి ఒక ఉపాయం చెప్తుంది. పికీ తన సొంత గ్రామంలో ఒక పాడుబడిన పురాతన ఆలయం ఉందని, అక్కడ చనిపోయిన వారితో మాట్లాడవచ్చని చెప్తుంది. ఆ ఆలయ గడపపై నిలబడి ఆలివర్ బూడిదను చల్లితే, గది తలుపు అవతలి వైపు నుండి ఆలివర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్తుంది.

కానీ “ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా టెంపుల్ తలుపును మాత్రం అస్సలు తెరవకూడదు” అని పికీ చాలా గట్టిగా హెచ్చరిస్తుంది. మరియా ఆ ఆలయానికి వెళ్లి తన కొడుకు ఆత్మతో మాట్లాడుతుంది. కానీ ఆలివర్ ఆత్మ తనను రక్షించమని, తలుపు తీయమని ఏడవడం చూసి తట్టుకోలేక మరియా ఆ కఠినమైన నియమాన్ని ఉల్లంఘించి, ఆలయం తలుపును తెరుస్తుంది.

Advertisement

ఆ తలుపు తెరవడంతో మనుషుల ప్రపంచానికి, మృతుల ప్రపంచానికి మధ్య ఉన్న సమతుల్యత దెబ్బతింటుంది. ఆలివర్ ఆత్మతో పాటు ఒక భయంకరమైన దుష్టశక్తి…. మృతుల ప్రపంచాన్ని కాపాడే నాలుగు చేతుల దేవుడు మైర్టిస్ వాళ్ళ ఇంటికి వస్తుంది. మొదట పికీని, ఆ తర్వాత మరియా పెంపుడు కుక్కను చంపేస్తుంది. చివరికి ఆలివర్ ఆత్మ మరియా కూతురైన లూసీ శరీరాన్ని ఆవహిస్తుంది. తన తప్పును తెలుసుకున్న మరియా, తన కూతురిని కాపాడుకోవడం కోసం ఆ దుష్టశక్తికి తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. మరి మరియాను భర్త ఏం చేశాడు ? ఆ దుష్ట ఆత్మ నుంచి కూతురిని ఎలా కాపాడుకున్నాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘ది అదర్ సైడ్ ఆఫ్ ది డోర్’ ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలో ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు. 2016లో విడుదలై, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ సినిమాలో సరా మిచెల్ గెల్లార్, జెరెమీ ఇర్వైన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also: చెవులు కోసుకుని కరకర నమిలేసే పిల్ల పిశాచి… ‘కాంతారా’ లాంటి థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×