E-Paper
Advertisement

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?
Advertisement

OTT Movie : ఒక సిరీస్ నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో ఉంటూ, IMDbలో 9.1 రేటింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అదే ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ (The Legend of Hanuman). ఈ యానిమేటెడ్ సిరీస్ రామాయణం నుండి హనుమాన్‌ ని ఫోకస్ చేసి, భారతీయ మిథాలజీని మ్యాజికల్‌గా చూపిస్తుంది. 2021లో సీజన్ 1 వచ్చినప్పటికీ, సీజన్ 6 వరకు వస్తున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌లో టాప్ స్థానంలో ఉంది. గ్రాఫిక్ ఇండియా ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్, ఇండియన్ యానిమేషన్‌లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 7 భాషలలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ 2021లో వచ్చిన భారతీయ యానిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్. దీనిని షరద్ దేవరాజన్, జీవన్ జె. కాంగ్, చారువి అగర్వాల్ రూపొందించారు. 2021 జనవరిలో సీజన్ 1తో హాట్‌ స్టార్‌లో మొదలైన ఈ ప్రయాణం, రీసెంట్ గా వచ్చిన సీజన్ 6 వరకూ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. 6 సీజన్ లు వచ్చినా కూడా, వీక్లీ వ్యూస్ 14.8 మిలియన్ లకు చేరుకుందంటే మామూలు విషయం కాదు. చిన్న పిల్లల నుంచి, పెద్దల దాకా ఈ సిరీస్ ను బాగా ఇష్టపడుతున్నారు.

కథలోకి వెళ్తే

Advertisement

హనుమాన్ చిన్నప్పటి నుంచి తన శక్తులు మర్చిపోయి, సాధారణ వానరుడిగా సూగ్రీవ్ రాజు సేవలో ఉంటాడు. ఈ సమయంలో రాముడు, సీతను వెతకడానికి సూగ్రీవ్ సహాయం కోరతాడు. హనుమాన్, రాముడితో కలిసి సీతను వెతకడానికి అడవిలో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో హనుమాన్ తన శక్తులు మర్చిపోయినా, ధైర్యం, విశ్వాసంతో పోరాడతాడు. ఎన్నో అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తాడు. రాముడికి సహాయం చేస్తూ, ఆయన సేవలో లీనమవుతాడు.

Read Also : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Advertisement

రామ్, లక్ష్మణ్‌తో హనుమాన్ కలిసి లంకకు కూడా వెళ్తాడు. అక్కడ సీతను చూసి రావణుడికి బుద్ది చెప్పాలనుకుంటాడు. హనుమాన్ తన శక్తులతో రావణ్‌ను భయపెడతాడు. అక్కడ లంకా దహనం చేసి తిరిగి రాముడి దగ్గరకి వస్తాడు. హనుమాన్ తన పూర్తి శక్తులను పొంది, రాముడికి సహాయం చేస్తూ, రావణ్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి రావణుడిని ఓడించడంలో హనుమాన్ కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సిరీస్ రామాయణ కథను కొత్తగా, హనుమంతుడి అద్భుతాలను గొప్పగా చూపిస్తుంది.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×