E-Paper
Advertisement

OTT Movie : క్రీస్తును కొత్త కోణంలో చూపించన సినిమా… ఆ సీన్స్ తో వివాదాల సునామీ

OTT Movie : క్రీస్తును కొత్త కోణంలో చూపించన సినిమా… ఆ సీన్స్ తో వివాదాల సునామీ
Advertisement

OTT Movie : యేసు క్రీస్తు జీవితాన్ని చాలా కాంట్రవర్షియల్‌గా చూపించిన సినిమా ఒకటి ఉంది. అయితే వివాదాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సెన్సిటివ్ అంశంతో చాలా చోట్ల ఈ సినిమాని నిలిపివేశారు. ఈ సినిమాలో యేసుని ఒక మామూలు మనిషిలా చూపించడంతో చాలా మంది క్రైస్టియన్స్‌ దీనిని పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. అయితే థియేటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

మార్టిన్ స్కార్సెసే దర్శకత్వంలో వచ్చిన ఈ ఎపిక్ రెలిజియస్ మూవీ పేరు ‘ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్’.ఇందులో విల్లెమ్ డాఫో యేసు పాత్రలో, హార్వే కీటెల్ జుడాస్‌గా, బార్బరా హెర్షే మేరీ మాగ్డలీన్‌గా నటించారు. 1988 ఆగస్టు 12న USలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాయ్‌కాట్స్ కి గురైంది. 2 గంటల 44 నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TV అందుబాటులో ఉంది. ఈ సినిమా 1989 ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ (స్కార్సెసే) నామినేషన్, గోల్డెన్ గ్లోబ్ లో బెస్ట్ డైరెక్టర్ నామినేషన్ కూడా దక్కించుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఆలివ్ తోటలో యేసు మొకాళ్ల మీద కూర్చుని బాధపడుతుంటాడు. ఆ సమయంలో అతనికి రెండు మాటలు వినబడతాయి. ఒక గొంతు నువ్వు దేవుని కొడుకువి అంటే, మరొకటి నువ్వు సైతాన్ అని అంటుంది. దీంతో తలనొప్పి వచ్చి, యేసు గట్టిగా అరుస్తాడు. యేసు కర్పెంటర్ గా పని చేస్తుంటాడు. యూదుల్ని రోమన్లు ఉరి వేసి వేలాడదీయడానికి కావాల్సిన సామాగ్రిని తయారు చేస్తుంటాడు. ఆ పని చేస్తుంటే తనకే గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది. ఆ గ్రామంలో మేరీ అనే అమ్మాయిని చూస్తాడు. బాల్యంలోనే ఆమెను యేసు ఇష్టపడే వాడు. కానీ ఇప్పుడు ఆమె ఒక వేశ్య. ఒక రోజు గ్రామస్తులు ఆమెను రాళ్లతో కొట్టబోతుంటే యేసు వచ్చి, పాపం చేయని వాడే ముందు రాయి విసరాలని అనడంతో అందరూ షాక్ అవుతారు. యేసుని చూసి మేరీ ఏడుస్తుంది. నన్ను ఎందుకు వదిలేసావని బాధపడుతుంది.

ఇతని బెస్ట్ ఫ్రెండ్ జుడాస్ ఒక తిరుగుబాటు వ్యక్తి. రోమన్లను కత్తులతో తరిమికొట్టాలనుకుంటాడు. యేసుని నీదగ్గర మహిమలు ఉంటే చూపించాలని ఎగతాళి చేస్తాడు. యేసు ఎడారిలో 40 రోజులు ఫాస్టింగ్ చేస్తాడు. అక్కడ సాతాను మూడు రూపాల్లో వచ్చి యేసుని టెంప్ట్ చేస్తాడు. కానీ యేసు సాతాను మాటలు లెక్కచేయడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి బాప్టిజం తీసుకుంటాడు. అప్పటి నుంచి ప్రవచనాలు స్టార్ట్ చేస్తాడు. అయితే ఒక చిన్న అమ్మాయి సాతాను రూపం వచ్చి నువ్వు సాధారణ మనిషిగా బతుకు అని చెబుతుంది. యేసు ఆ టెంప్టేషన్‌కు లొంగిపోతాడు. మేరీ మాగ్డలీన్‌తో మ్యారేజ్ చేసుకుంటాడు. పిల్లలు కూడా పుడతారు. అయితే క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఈ ముగింపుని తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×