E-Paper
Advertisement

తండ్రి ప్రియుడి మధ్యలో నలిగిపోయిన అక్కా చెల్లెల్లు… కన్నీళ్లు పెట్టించే కథ

తండ్రి ప్రియుడి మధ్యలో నలిగిపోయిన అక్కా చెల్లెల్లు… కన్నీళ్లు పెట్టించే కథ
Advertisement

Melodrama OTT : కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలలో కంటెంట్ అంత బలంగా ఉంటుంది మరి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఆడవాళ్ళ కోరికల్ని, వాళ్ళ ఇష్టాల్ని ఈ లోకం ఎలా తొక్కేస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా మొత్తం ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎక్కడా బోరింగ్ అనిపించదు చూస్తుంటే. దీనికి ఐయండిబిలో 7.7 రేటింగ్ కూడా ఉంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ బ్రెజిలియన్ డ్రామా పేరు ‘ఇన్విజిబుల్ లైఫ్ ఆఫ్ యురిడిస్ గుస్మావో’ (The Invisible Life of Eurídice Gusmão). మార్తా బాటల్హా రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన ‘అన్ సర్టైన్ రిగార్డ్’ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు కరీం ఐనూజ్ దర్శకత్వం వహించగా, యురిడిస్, గైడా పాత్రల్లో కరోల్ డ్యుఆర్టే, జూలియా స్టాక్లర్ అద్భుతంగా నటించారు. క్లైమాక్స్‌లో లెజెండరీ నటి ఫెర్నాండా మోంటెనెగ్రో పోషించిన పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. ఈ సినిమాను ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video) ప్లాట్‌ ఫామ్‌లో చూడవచ్చు

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1950ల కాలంలో రియో అనే ఊళ్ళో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. ఒక అమ్మాయి పేరు గైడా, ఇంకొక అమ్మాయి పేరు యురిడిస్. వీళ్ళిద్దరికీ బోలెడు ఆశలు ఉండేవి. అక్క గైడా ఏమో ప్రేమించినోడితో చెక్కేయాలని చూస్తే, చెల్లి యురిడిస్ కి పియానో వాయించి పెద్ద మ్యూజిషియన్ అయిపోవాలని ఉండేది. కానీ వాళ్ళ నాన్న మాత్రం పాతకాలం మొండి మనిషి. ఆడపిల్లలు ఇంట్లోనే పడి ఉండాలి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనే టైపు. అయితే ఒకరోజు అక్క గైడా ఇంట్లో చెప్పకుండా తన లవర్‌తో కలిసి పారిపోతుంది. కానీ వాడు మోసం చేయడంతో గర్భవతిగా మళ్ళీ ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా, నీ చెల్లి యూరప్ వెళ్ళిపోయిందని అబద్ధం చెప్పి గెంటేస్తాడు.

అటు చెల్లికి కూడా నీ అక్క చచ్చిపోయిందని చెప్పి నమ్మిస్తాడు. పాపం ఒకే ఊళ్ళో ఉన్నా కూడా ఆ నాన్న ఆడిన నాటకం వల్ల ఒకరినొకరు కలుసుకోలేక, వెతుక్కుంటూనే దశాబ్దాలు గడిపేస్తారు. చెల్లి యురిడిస్ ఏమో మొగుడు, పిల్లలు అంటూ ఆ ఇంటి గోడల మధ్యే తన టాలెంట్‌ని చంపేసుకుని బతుకుతుంది. అక్క ఏమో కష్టాలు పడుతూ ఒంటరిగా కొడుకుని సాకుతుంది. ఒకరికి ఒకరు రాసుకున్న ఉత్తరాలు కూడా ఆ నాన్న దాచేస్తాడు. చివరికి ఈ అక్కాచెల్లెళ్లు కలుసుకుంటారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : చదువు ఉన్నా విధిని జయించలేక… పల్లెటూరి ఆచారాల మధ్య చిక్కుకున్న ఒక డాక్టర్ కథ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×