// // Netflix Best Horror Web Series : హాంటెడ్ హౌస్ లో వణికించే -->
E-Paper
Advertisement

Netflix Best Horror Web Series : హాంటెడ్ హౌస్ లో వణికించే దెయ్యాలు… రాత్రైతే రక్తపాతమే… ఒంటరిగా చూడకూడని సిరీస్

Netflix Best Horror Web Series : హాంటెడ్ హౌస్ లో వణికించే దెయ్యాలు… రాత్రైతే రక్తపాతమే… ఒంటరిగా చూడకూడని సిరీస్
Advertisement

Netflix Best Horror Web Series : హారర్ జానర్ స్టోరీలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటిని చూసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొన్ని స్టోరీలను స్ట్రాంగ్ హార్ట్ ఉన్నవాళ్లు మాత్రమే చూసేలా ఉంటాయి. కొన్ని సీన్స్ కి పై ప్రాణాలు పైకి పోయేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఒక హాంటెడ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. అందులోకి కొత్తగా వచ్చిన ఫ్యామిలీ దెయ్యాలతో ఎదుర్కునే సంఘటనలతో ఈ సిరిస్ నడుస్తుంది. చిల్లింగ్ థ్రిల్ పక్కాగా ఇచ్చే ఈ సిరీస్, హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్. ఇది ఐయండిబిలో కూడా టాప్ రేటింగ్ పొందింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ సూపర్నాచురల్ హారర్ మినీ సిరీస్ పేరు ‘ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’. దీనిని మైక్ ఫ్లానగన్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేశాడు. ఇది 2018 అక్టోబర్ 12 నుంచి 10 ఎపిసోడ్లతో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కార్లా గుగినో (ఒలివియా క్రేన్), హెన్రీ థామస్ (యంగ్ హ్యూ), టిమోతీ హట్టన్ (ఓల్డ్ హ్యూ), మిచియల్ హూఇస్‌మన్ (స్టీవెన్), విక్టోరియా పెడ్రెట్టి (నెల్), ఎలిజబెత్ రీసర్ (షిర్లీ) లీడ్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో 8.5/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also : ఓటీటీలోకి బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్… డాక్టర్ హత్య కేసుతో ఉత్కంఠ రేపే స్టోరీ… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

స్టోరీ ఏమిటంటే

హ్యూ, ఒలివియా వాళ్ల ఐదుగురు పిల్లలతో (స్టీవెన్, షిర్లీ, థియోడోరా) 1992లో హిల్ హౌస్ అనే పాత మాన్షన్‌లోకి మారతారు. దాన్ని మరమ్మత్తులు చేసి అమ్మి, డ్రీమ్ హౌస్ కట్టాలని ప్లాన్ చేతారు. కానీ ఆ ఇంట్లో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. విచిత్ర శబ్దాలు, గోస్ట్స్ వంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా భయపడతారు. ఒలివియాకి ఆ ఇంటి ప్రభావంతో పిచ్చి పట్టినట్లు అవుతుంది. ఒక పాత గోస్ట్ ఆమెలో పాసెస్ అవుతుంది. పిల్లలను చంపాలని చూస్తుంది. ఒక రాత్రి ఆమె రాట్ పాయిజన్ పోసి పిల్లలను చంపబోతుంది, కానీ హ్యూ ఆపి పిల్లలను తీసుకుపోతాడు. ఒలివియా ఇంటి నుంచి జంప్ చేసి సూసైడ్ చేసుకుంటుంది.

Advertisement

కథ ప్రజెంట్ కి వస్తుంది. ఆ ఇంటినుంచి చిన్నప్పుడు బయట పడిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. సిటీలో మంచి లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే ఆ ఇంట్లో ఉన్న దెయ్యం మళ్ళీ వాళ్ళను రప్పిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక రెడ్ రూమ్ మిస్టరీ ఓపెన్ అవుతుంది. దీంతో స్టోరీ మరింత ఉత్కంఠంగా సాగుతుంది. చివరికి ఈ ఫ్యామిలీ ఆ మాన్షన్ నుంచి బయట పడుతుందా ? వీళ్ళను హంట్ చేస్తున్న దెయ్యం గతం ఏమిటి ? ఆ రెడ్ రూమ్ లో ఏముంది ? అనే విషయాలను, ఈ సూపర్నాచురల్ హారర్ మినీ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×