E-Paper
Advertisement

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : సోషల్ మెసేజ్ తో దర్శకులు కొన్ని అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అవినీతితో కూడిన సంఘటనలు, మహిళలు ఎదుర్కునే సమస్యలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే జరిగే దారుణమైన సంఘటనలను చూపిస్తుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు M. నైట్ ష్యామలాన్ రూపొందించిన ఈసినిమా, బాక్స్ ఆఫీస్ లో బంపర్ హిట్ అయింది. ఈ కథలో చెట్లు ఒక టాక్సిన్ ని రిలీజ్ చేయడంతో, మనుషులు సూ సైడ్ చేసుకుని చచ్చిపోతుంటారు. ఈసినిమా క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘ది హ్యాపెనింగ్’ (The happening) 2008లో వచ్చిన అమెరికన్ సై-ఫై థ్రిల్లర్ సినిమా. M. నైట్ ష్యామలాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎలియట్ మూర్ (మార్క్ వాల్‌బర్గ్), అల్మా (జూయీ డెషానెల్), జెస్ (ఆష్లీ రోస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 జూన్ 13న రిలీజ్ అయ్యింది. 1 గంట 31 నిమిషాల నిడివితో IMDbలో 5.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో, ఎలియట్ ఒక సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ అల్మాతో, అతనికి కొన్ని రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక రోజు సిటీలో ఉండే ఒక సెంట్రల్ పార్క్‌లో విచిత్రమైన సంఘటన జరుగుతుంది. మనుషులు ఒక్కసారిగా ఆగిపోయి, తమను తాము చంపుకుంటారు. కొందరు బిల్డింగ్‌ల నుంచి దూకుతారు, కొందరు తమను తాము హర్ట్ చేసుకుంటారు. ఈ సంఘటన నగరమంతా వ్యాపిస్తుంది. ఎలియట్, అల్మా, ఎలియట్ ఫ్రెండ్ జోయ్, జోయ్ కూతురు జెస్ కలిసి, ఒక సేఫ్ ప్లేస్ కోసం ట్రై చేస్తారు. వాళ్లు పెన్సిల్వేనియాలోని ఒక రూరల్ ఏరియాకు వెళ్తారు. అక్కడ వీళ్ళంతా సేఫ్ అని అనుకుంటారు.
ఈ మరణాలకు కారణం ఏంటో తెలీదు, కానీ ఎలియట్ గెస్ చేస్తాడు.

చెట్లు ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తున్నాయని, అది మనుషులను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపిస్తోందని తెలుస్తుంది. ఎక్కువ మనుషులు ఉన్న ప్లేస్‌లో ఈ టాక్సిన్ ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఈ సమయంలో ఎలియట్ గ్రూప్ రోడ్డుపై ఎస్కేప్ అవుతూ, ఇతర సర్వైవర్స్‌ను కలుస్తారు. వాళ్లు ఒక ఓల్డ్ లేడీ జూలియా ఇంటికి వెళ్తారు. మనం ప్రకృతిని డ్యామేజ్ చేసినందుకు, ప్రకృతి మనపై రివెంజ్ తీర్చుకుంటోందని జూలియా చెబుతుండగానే, ఆమె కూడా ఈ టాక్సిన్ వల్ల చనిపోతుంది. ఎలియట్, అల్మా, జెస్ ఇంకా పారిపోతూ సేఫ్ ప్లేస్ వెతుకుతారు. ఒక రూరల్ ఏరియాలో వీళ్ళు సేఫ్ ప్లేస్ ను కనుక్కుంటారు. అక్కడికి వెళ్ళాక ఈ టాక్సిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. వాళ్లు బతికి బయట పడతారు. అయితే అనూహ్యంగా ఈ సంఘటన మళ్లీ వేరే నగరంలో స్టార్ట్ అవుతుంది. ప్రకృతిని మనుషులు డ్యామేజ్ చేస్తే ఏం జరుగుతుందో, ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Advertisement

Read Also : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×