E-Paper
Advertisement

OTT Movie : మనుషులను చంపే తోడేళ్ళ గుంపు … బుర్ర పాడు చేసే క్రేజీ యాక్షన్-థ్రిల్లర్

OTT Movie : మనుషులను చంపే తోడేళ్ళ గుంపు … బుర్ర పాడు చేసే క్రేజీ యాక్షన్-థ్రిల్లర్
Advertisement

OTT Movie : యాక్షన్-థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే యాక్షన్-థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాన్స్ ఉన్నారు. ఓటీటీ లో ఇటువంటి సినిమాలే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక తోడేళ్ల గుంపు బీభత్సం సృష్టిస్తుంది. కొంతమంది మనుషులు వాటినుంచి తప్పించు కోవాలని చూస్తారు. ఈ సినిమా చివరివరకూ యాక్షన్ సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ హాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది గ్రే’ (The Grey). 2012 లో వచ్చిన ఈ మూవీకి జో కర్నాహన్ దర్శకత్వం వహించారు. ఇందులో లియామ్ నీసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో లియామ్ నీసన్, ఫ్రాంక్ గ్రిల్లో, డెర్మోట్ ముల్రోనీ, డల్లాస్ రాబర్ట్స్, జో ఆండర్సన్ వంటి నటులు నటించారు. ఇది ఇయాన్ మెకెంజీ జెఫర్స్ రచించిన ‘ఘోస్ట్ వాకర్’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది. ఒక విమాన ప్రమాదం తర్వాత అలాస్కాలో చిక్కుకుపోయిన మనుషుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. వారు కెనడియన్ బూడిద రంగు తోడేళ్ళ నుండి బయట పడాల్సి వస్తుంది. జనవరి 27, 2012 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో లియామ్ నీసన్ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా $81 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

జాన్ ఒట్ట్వే అనే షార్ప్‌షూటర్ అలాస్కాలోని ఒక రిమోట్ ఆయిల్ రిగ్‌లో పనిచేస్తుంటాడు. అతని జీవితం అంతా విషాదంతో నిండి ఉంటుంది. అతను ఇప్పుడు ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతుంటాడు. ఒక రోజు, అతను తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్న విమానం అలాస్కా అడవుల్లో కూలిపోతుంది. ఈ ప్రమాదంలో కొంత మంది చనిపోతారు. ఈ క్రాష్‌లో బయటికి బయటపడిన కొద్దిమంది హిమపాతం, తీవ్రమైన చలి, ఆహారం లేకపోవడంతో ఆపరిస్తితులతో  పోరాడాల్సి వస్తుంది. అంతేకాకుండా, వారిని ఒక దారుణమైన తోడేళ్ల గుంపు బెదిరిస్తుంది. ఒట్ట్వే తన నాయకత్వ నైపుణ్యాలను ఉపయోగించి, ఈ బృందాన్ని బయటకు నడిపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రతి అడుగులోనూ మరణం వారిని వెంటాడుతుంది. అడుగు ముందుకు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడాల్సి వస్తుంది. ఆ తోడేళ్లను చూస్తేనే ప్రాణాలు పైకి పోతాయి. అంత భయంకరంగా ఉంటాయి అవి. అవి వేటాడే తీరు ప్యాంట్ తడిచి పోయేలా చేస్తుంది. చివరికి జాన్ ఆ ప్రయాణికుల్ని కాపాడుతాడా ? వీళ్ళంతా తోడేళ్ల గుంపుకు బలి అవుతారా? మరెవరైనా సహాయం చేస్తారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యాక్షన్-థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : డబ్బులకోసం ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయి … ప్రతీకారం తీర్చుకునే నర్స్ … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×