E-Paper
Advertisement

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ
Advertisement

OTT Movie: సైకో కిల్లర్ అనే పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. వీళ్ళు చేసే ఆరాచకాలకు ఇక హద్దు ఉండదు. దెయ్యాలు కూడా చేయని హింసని వీళ్ళు చిటికెలో చేసేస్తుంటారు. ఇక ఇలాంటి సినిమాలకు కూడా ఓటీటీలో కొదవ లేదు. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా రివేంజ్ థీమ్ లో రూపొందింది. ఒక మహిళా సైకో జైలు నుంచి ఇరవై సంవత్సరాల తరువాత తప్పించకుని, ఒక యువతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఈ మూవీ బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

‘ది గర్ల్ హూ గాట్ అవే’ (The Girl Who Got Away) అనే థ్రిల్లర్ సినిమాని మైఖేల్ మోరిస్సీ తెరకెక్కించారు. ఇందులో లెక్సీ జాన్సన్ ,కే టకర్‌మన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2021లో విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోఅందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్‌ పట్టణంలో ఎలిజబెత్ అనే సీరియల్ కిల్లర్, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, వాళ్లను చంపేస్తూ ఉంటుంది. ఆమె ఇల్లు ఒక జైలులా ఉంటుంది. ఆమె కిడ్నాప్ చేసిన పిల్లల్ని బేస్‌ మెంట్‌లో బంధిస్తుంటుంది. వాళ్లకు కొత్త పేర్లు పెడుతుంది. ఆమె వాళ్ళకు తల్లి అని చెప్పి నమ్మించి హింసిస్తుంది. ఒక రోజు ఆమె బంధించిన ఐదుగురు పిల్లల్లో కేటీ అనే పిల్ల తప్పించుకుంటుంది. మిగతా నలుగురి మృతదేహాలు ఆమె ఇంటి వెనుక ఖననం చేయబడి ఉంటాయి. ఆ తరువాత పోలీసులు ఎలిజబెత్‌ను అరెస్ట్ చేస్తారు. ఆమెను చనిపోయేవారకు జైలులో వుండేటట్లు శిక్ష వేస్తారు. 20 సంవత్సరాల తర్వాత కేటీ ఇప్పుడు ఒక టీచర్ గా ఉంటుంది. ఆమె తన గతం గురించి ఎవరికీ చెప్పదు.

Read Also : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

Advertisement

ఆమెకు ఇప్పుడు ఆరన్ అనే ఒక బాయ్‌ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కానీ ఆమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఎలిజబెత్ జైలు నుంచి తప్పించుకుందన్న విషయం తెలిసి కేటీ భయపడుతుంది. ఆమె దగ్గరికి ఒక డిటెక్టివ్ వచ్చి, ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. కేటీని వెతుకుతూ ఎలిజబెత్ పట్టణంలోకి వస్తుంది. ఆమె ముందుగా ఆరన్‌ను చంపేస్తుంది. ఆ తరువాత కేటీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కథలో భారీ ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? కేటీని కూడా ఎలిజబెత్ చంపుతుందా ? ఇరవై సంవత్సరాల కేటీ వెంట ఎందుకు పడుతోంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×