E-Paper
Advertisement

OTT Movie : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

OTT Movie : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా
Advertisement

OTT Movie : జాంబీ హారర్ సినిమాలలో ఒళ్ళు గగుర్పొడిచే తీవ్రమైన రక్తపాతం ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది వచ్చిన ఒక ఇండోనేషియన్ జాంబీ హారర్ థ్రిల్లర్ సినిమాని ఆడియన్స్ చూడటానికే చాలా భయపడిపోయారు. ఒక్కో సీన్ అంత ఆరాచకంగా ఉంటుంది. ఈ మూవీ ఒక గ్రామంలో జరిగే జాంబీ ఔట్‌బ్రేక్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి యవ్వనంగా ఉండటానికి చేసిన ఒక ఔషధం వల్ల అందరూ జాంబీలుగా మారిపోతారు. సింపుల్  గా చెప్పాలంటే డబ్బు సంపాదన కోసం టెస్టింగ్ లేకుండా మందు లాంచ్ చేస్తే ఏమవుతుందో ఈ సినిమా చూపిస్తుంది. జాంబీ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2025లో విడుదలైన ఇండోనేషియన్ జాంబీ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది ఎలిక్సర్’. దీనిని కిమో స్టాంబోల్ తెరకెక్కించారు. ఇందులో మిఖా తాంబయోంగ్, ఎవా సెలియా, డాన్నీ దామారా, మార్తినో లియో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 1 గంట 58 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 5.3/10 రేటింగ్ పొందింది. 2025 అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇండోనేషియన్ ఒరిజినల్ తో పాటు ఇంగ్లీష్, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మగాళ్లను ముక్కలుగా కోసే కత్తిలాంటి అమ్మాయి… ఈ హిట్టు మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ పేరెత్తితే ఒట్టు

స్టోరీ ఏమిటంటే

ఇండోనేషియాలోని ఒక చిన్న గ్రామంలో ‘ఎలిక్సర్’ అనే ఒక పెద్ద హెర్బల్ మందుల కంపెనీ ఉంటుంది. దానిని గ్రేస్ అనే ఒక పెద్దాయన నడుపుతుంటాడు. ఆ మందులతో ఎక్కువకాలం యవ్వనంలో ఉండటానికి తయారు చేస్తుంటారు. ఒక రోజు యజమాని గ్రేస్ ఎప్పుడూ యవ్వనంగా ఉండేందుకు ఒక మందు కనిపెడతాడు. టెస్టింగ్ లేకుండా తనే మొదట తాగేస్తాడు. అయితే అతను దాని వల్ల రెండు రోజుల్లో జాంబీ అయిపోతాడు. ఆ మందు ఇప్పటికే గ్రామంలో దుకాణాల్లో పడటంతో అందరూ తాగేసి పూర్తి గ్రామమే జాంబీలతో నిండిపోతుంది. గ్రేస్ ఫ్యామిలీలో మిగిలింది కూతురు సారా, చిన్న కొడుకు రాకా, పెద్ద కొడుకు డిమిన్ ముగ్గురే. ఇంట్లో దాక్కుని, జాంబీలతో ఫైట్ చేస్తూ, చివరికి ఒక ట్రక్‌లో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ మందు అనుకోకుండా తాగి డిమిన్ కూడా జాంబీ అవుతాడు. దీంతో సారా, రాకా పెద్దన్నని ట్రక్‌తోనే ఢీ కొట్టి పారిపోవాల్సి వస్తుంది. రక్తం, అరుపులతో నిండిన ఆ గ్రామం మధ్య ఇద్దరూ ఎలా ప్రాణాలతో బయట పడతారన్నదే ఈ సినిమా.

Advertisement

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×